ఆలియా భట్(Alia Bhatt)..“స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ “ మూవీతో బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ కూతురిగా తెరంగేట్రం చేసింది. బట్ ఆపేరు చివర తోకను ఆమె తన బ్రిలియంట్ యాక్టింగ్ స్కిల్ తో కట్ చేసేసింది. కట్ చేస్తే ..ఆమె ఇప్పుడు బాలీ వుడ్ బ్యూటీ క్వీన్…స్టార్ హీరోయిన్. ఎదురైన ఏ టాస్క్ నైనా ఛాలెంజ్ గా తీసుకుని ఫేస్ చేస్తుంది.
ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి (రామ్ చరణ్) భార్యగా నటించింది. ఇచ్చిన పాత్ర నిడివి చిన్నదే అయిన ఆ పాత్రను అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. ఫాస్ట్ లెర్నరైన ఆలియా ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ లో తెలుగు నేర్చేసుకుంది.
నిజానికి రాజమౌళి సినిమాకు తీసుకునే టైమ్ లో ప్రపంచంలో ఉన్నఅన్నిభాషలూ నేర్చుకోవచ్చు అనుకోండి.! కాకపోతే తెలుగు నేర్చుకోవడం కాస్త కష్టం. ఆలియా భట్ ప్రస్తుతం హాలీవుడ్ లో నటిస్తుంది. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే సినిమాతో హాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది ఆలియా. ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది ఈ బాలీవుడ్ ముద్దు గుమ్మ.
తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో తెలుగులో మాట్లాడి ఆకట్టుకుంది. అంతే కాదు.. తన కో స్టార్ అయిన ‘గాల్ గాడోట్’తో తెలుగులో మాట్లాడించింది. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్ఆర్ఆర్ సమయంలోనూ అలియా తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్న విషయం తెలిసిందే.!
ప్రీరిలీజ్ ఈవెంట్ లో ముద్దుముద్దుగా తెలుగులో మాట్లాడి ఔరా! అనిపించింది. తాజాగా గాల్ గాడోట్తో మాట్లాడుతూ.. అందరికి నమస్కారం.. మీకు నా ముద్దులు అంటూ తెలుగులో మాటాడించింది.