Telugu News » సగ్గుబియ్యం జావ.. వ‌హ్వా..!

సగ్గుబియ్యం జావ.. వ‌హ్వా..!

by admin
amazing Benefits Of Sabudana

సగ్గుబియ్యం..తెల్లగా.. కడిగిన ముత్యాల్లా..పూస పూసగా అమ్మచేసిన నెయ్యిలాగా ఉంటాయి. పాయసంలో వేసినప్పుడు వీటి సొగసు చూడాలి. తినకపోతే నీ కర్మ అన్నట్టు చూస్తాయి. ఆకాశం నుంచి ఊడిపడ్టట్టే ఫోజులు కొడతాయి. కానీ, అవి కర్రపెండ్లం అనే ఓ దుంప నుంచి వస్తాయని చాలా తక్కువ మందికి తెలుసు. ఈ సగ్గుబియ్యాన్ని ఇంగ్లీష్ లో శాగో అంటారు. వీటి దుంపతెగ 500 కిలోల దుంపలను ప్రాసెస్ చేస్తే 100 కేజీల సగ్గుబియ్యం వస్తాయి.

amazing Benefits Of Sabudana

భూమినుంచి తీసిన దుంపలు 24 గంటల్లోపులోగా ఫ్యాక్టరీకి వెళ్లిపోవాలి ఎండితే పశువులు తినడానికి తప్ప ఎందుకూ పనికి రావు. ఎందుకంటే పచ్చిగా ఉన్నప్పుడే దుంప నుంచి పాలొస్తాయి. ఆ పాల నుంచి తేమ శాతాన్ని తీసి చిక్కబడిన తర్వాత జల్లెళ్లలో వేసి పూసల్లా తయారు చేస్తారు. అప్పుడు శాగో రెడీ అవుతుంది. వీటి పుట్టుక కష్టమైతే అయ్యింది గానీ.. ఇది మన శరీరానికి గొప్పమేలు చేస్తుంది. సగ్గు బియ్యంతో చేసే జావ శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. రక్తపోటు, డయాబెటీస్ కంట్రోల్లో ఉండేలా చేస్తుంది.

నీరసం,అధిక బరువు, కీళ్ల నొప్పలతో బాధపడేవారికి సగ్గుబియ్యం జావ ఎంతో మేలు చేస్తుంది. రోగులకు తక్షణ శక్తినిస్తుంది. కొవ్వును తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునేవాళ్లకు సగ్గు బియ్యం మంచి ఆప్షన్. స్టార్చ్ శాతం ఎక్కవగా ఉన్న కారణంగా రసాయనాలు లేని నేచురల్ స్వీట్ హార్ట్ ఇది. కండరాల పెరుగుదలకు ఎంతో ఉపకరిస్తుంది. అంతే కాదు, ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. కాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల బ్లెడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేయడంతో పాటు కొలస్ట్రాల్ ని మెరుగు పరుస్తుంది.

గుండె సంబంధ వ్యాధులకు ప్రత్యామ్నాయ ఆహారంగా స‌గ్గుబియ్యం ఉపయోగపడుతుంది. ఇంత మేలు చేసే సగ్గుబియ్యాన్ని వదిలేస్తే ఎలా.. జావచేసుకుని జుర్రెయ్యొద్దు.

ఎలా చెయ్యాలంటే ముందుగా 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. అందులో గ్లాస్ పాలు ఒక టీస్పూన్ బెల్లం తురుము వేసి స్టవ్ మీద పెట్టి కాసేపు ఉడికించుకుంటే జావ రెడీ అయినట్టే. తాగితే మన ఆరోగ్యం మన వెంట ఉన్నట్టే.

You may also like

Leave a Comment