Telugu News » Winter Season Food : శీతాకాలంలో రోగనిరోధక శక్తి పెంచే ఆహారాలు ఏంటో తెలుసా..?

Winter Season Food : శీతాకాలంలో రోగనిరోధక శక్తి పెంచే ఆహారాలు ఏంటో తెలుసా..?

చలికాలంలో జలుబు, ఫ్లూతో బాధపడుతున్నట్లయితే మీ రోగనిరోధక శక్తి (Immunity) బలహీనంగా ఉందని అర్ధం.. అందుకే ఈ కాలంలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటున్నారు ఆరోగ్యనిపుణులు.

by Venu

చలికాలం రాగానే వాతావరణ మార్పుల వల్ల పలు రకాల వ్యాధులు పలకరిస్తాయి. జలుబు, దగ్గు వంటి వ్యాధులు అయితే నీడలా వెంబడిస్తాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే వ్యాధులకు పండగే.. మరీ వ్యాధుల నుంచి కొంతవరకైనా బయట పడాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్యనిపుణులు వెల్లడిస్తున్నారు..

చలికాలంలో జలుబు, ఫ్లూతో బాధపడుతున్నట్లయితే మీ రోగనిరోధక శక్తి (Immunity) బలహీనంగా ఉందని అర్ధం.. అందుకే ఈ కాలంలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటున్నారు ఆరోగ్యనిపుణులు.. ఏ ఆహారం తీసుకోవాలని ఆలోచిస్తున్నారా.. అయితే చలి కాలంలో ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

చలికాలంలో శరీరం ఫిట్‌గా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు (Health professionals).. అలాంటి ఆహారాల్లో క్యారెట్లు ముందు వరుసలో ఉంటాయంటున్నారు.. అయితే, శీతాకాలం (Winter)లో తాజా క్యారెట్లు తినడం వల్ల అనేక వ్యాధుల నుంచి శరీరానికి రక్షణ లభిస్తుందని.. క్యారెట్‌లో బీటా కెరోటిన్ ఉంటుంది కాబట్టి ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు..

శీతాకాలంలో మెంతికూర కూడా బెటర్ అని వెల్లడిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.. మెంతికూరలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు శరీర రక్షణకు ఎంతగానో దోహదం చేస్తాయని తెలుపుతున్నారు. మెంతుల పొడిని కూడా వివిధ వంటలలో ఉపయోగించవచ్చంటున్నారు. ఆవాల్లో ఫోలేట్, ఫైబర్ అధిక మొత్తంలో ఉండటం వల్ల ఈ సీజన్లో ఇది కూడా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.

శీతాకాలంలో తప్పనిసరిగా తినవల్సినవి నువ్వులు. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఖనిజాలు ఉంటాయి. శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో నువ్వులు ఏంతో తోడ్పడతాయి. పాలకూరను కూడా శీతాకాలపు సూపర్ ఫుడ్ అంటారు. ఐరన్, విటమిన్ ఎ, సి అధికంగా ఉండే పాలకూర శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.. కాబట్టి ఈ సీజన్ లో వచ్చే వ్యాధులకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్యనిపుణులు వివరిస్తున్నారు. అయితే ఏదైనా మితంగా తీసుకోవడం మాత్రం మరచిపోవద్దని తెలుపుతున్నారు.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను రాయడం జరిగింది.. వీటిని ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి.

You may also like

Leave a Comment