Telugu News » Virushka vacation : విహార యాత్రలో విరుష్కా జోడి.. కరీబియన్ కేఫ్ లో సెల్ఫీ సందడి..!

Virushka vacation : విహార యాత్రలో విరుష్కా జోడి.. కరీబియన్ కేఫ్ లో సెల్ఫీ సందడి..!

వృత్తి జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని విడిగా చూడకపోతే కలిసి జీవించడం కష్టం. ఎందు కంటే కలిసి జీవితాన్ని పంచుకోవడం అంత సులువు కాదు. అందులోనూ సెలబ్రిటీలకు ఇది కత్తిమీద సాము.

by sai krishna

వృత్తి జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని విడిగా చూడకపోతే కలిసి జీవించడం కష్టం. ఎందు కంటే కలిసి జీవితాన్ని పంచుకోవడం అంత సులువు కాదు. అందులోనూ సెలబ్రిటీలకు ఇది కత్తిమీద సాము.

ఎవరి ఈగోని వారు కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. కట్ చేస్తే బంధం తెగిపోతుంది. ఇద్దరు ఒకటవ్వడానికి తీసుకున్న టైమ్ కూడా విడిపోడానికి పట్టదు. ఈ విషయంలో విరాట్ – అనుష్క శర్మల జంట…చాలా ముచ్చటైన జంటని చెప్పొచ్చు.

ఎవరికి వారు తమ ప్రొఫెషన్లో ఎంత బీజిగా ఉన్నా కూడా.. ఫ్యామిలీ లైఫ్‌ని ఇద్ద‌రు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ప్ర‌స్తుతం హాలీడే ట్రిప్‌లో ఉన్న ఈ జంట‌ తాజాగా ఇన్‌స్టాలో ఓ ఫొటో షేర్ చేసింది.

కరీబియన్లోని బార్బ‌డాస్‌ (Barbados)లో విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ హాలీడే ట్రిప్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. ఈ జంట విధుల్లో తిరుగుతూ అక్క‌డున్న స్ట్రీట్‌ఫుడ్‌(Street food)ల‌ను ట్రై చేస్తుంది. తాజాగా వీరిద్ద‌రూ ఓ కేఫ్‌ను సంద‌ర్శించారు. అక్క‌డ ఫుడ్ బాగుందంటూ కోహ్లీ ఇన్‌స్టా(Insta)లో తెలిపాడు.

“బార్బడోస్‌లో ఉన్న ‘కేఫ్ అలా మెర్’ (CAFE A LA MER) అనే కేఫ్‌ను మీరు తప్పక విజిట్ చేయండి. అక్కడ మేము తిన్న ఫుడ్ చాలా బాగుంది.” అంటూ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకోచ్చాడు. ప్ర‌స్తుతం ఈ పోస్టు వైర‌ల్‌గా మారింది.

విరాట్ ప్రస్తుతం ఈ నెలాఖ‌రున మొద‌లవ్వనున్న ఆసియా క‌ప్ (Asia Cup 2023) కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడు. గతేడాది ఇదే టోర్నీలో ఫామ్‌లోకి వ‌చ్చిన ఈ స్టార్ ప్లేయ‌ర్ (Star player) మ‌ళ్లీ ప‌రుగుల వ‌ర‌ద పారించాల‌నే ఉద్దేశంతో ఉన్నాడు. ఈ మెగా టోర్నీలో 102 ర‌న్స్ చేస్తే కోహ్లీ వ‌న్డేల్లో 13 వేల క్ల‌బ్‌లో చేరతాడు.

మ‌రోవైపు దాదాపు మూడేళ్ల విరామం తర్వాత అనుష్కశర్మ ప్రస్తుతం ‘చక్‌దే ఎక్స్‌ ప్రెస్‌’(Chak De Express) సినిమాలో నటిస్తోంది. భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్‌ ఝులన్‌ గోస్వామి జీవిత కథ ఆధారంగా (Jhulan Goswamy biography) ఈ చిత్రం తెరకెక్కుతోంది. అనుష్క, ఆమె సోదరుడు కర్నేశ్‌ శర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రాసిత్‌ రాయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

You may also like

Leave a Comment