గత కొన్ని రోజుల నుండి వైయస్ జగన్ మేనల్లుడు షర్మిల కొడుకు అయిన రాజారెడ్డి పెళ్లి ప్రస్తావన వినపడుతోంది. రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల ఇంట పెళ్లి వేడుకలు మొదలు కాబోతున్నాయని వార్తలు అయితే వస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజారెడ్డి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అంటూ ఆరా తీస్తున్నారు అంతా. అయితే రాజారెడ్డి ప్రియా అట్లూరి అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫోటోలు కూడా ఇప్పటికే బయటికి వచ్చాయి. రాజారెడ్డి ప్రియా అట్లూరి కలిసి ఉన్న ఫొటోస్ బయటకు రావడంతో, కచ్చితంగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని అంతా మాట్లాడుకున్నారు.
ఇది ఇలా ఉంటే, తాజాగా వైయస్ విజయమ్మ ప్రియ ని కలిసారట. ఫోటో బయటకు రావడంతో పెళ్లి వార్తలకి ఇంకాస్త బలం చేకూరింది. ప్రియా కి విజయమ్మ చీర కూడా పెట్టారట బంగారు గాజులు కూడా గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తోంది. కచ్చితంగా పెళ్లి కన్ఫర్మ్ అయిపోయిందని వీళ్ళు పెళ్లి పీటలేకపోతున్నారని వార్తలు అయితే వస్తున్నాయి. షర్మిల కి కాబోయే కోడలు ప్రియా ఎవరు అనే విషయానికి వస్తే.. చట్నీస్ హోటల్స్ అధినేత అట్లూరి ప్రసాద్ మనవరాలుగా ప్రచారం అయితే సాగుతోంది.
Also read:
కానీ కొందరు ప్రియా అట్లూరి బ్రదర్ అనిల్ స్నేహితుడు శ్రీనివాస్ అట్లూరి కూతురు అని అంటున్నారు. బ్రదర్ అనిల్ కి సంబంధించిన వ్యాపార లావాదేవాలు అట్లురి శ్రీనివాస్ చూస్తున్నారట. అమెరికాలో అట్లూరి శ్రీనివాస్ కి కన్సల్టెన్సీ ఉందని వార్తలైతే వస్తున్నాయి శ్రీనివాస్ మాధవిల కూతురు ప్రియా అట్లూరి. ప్రియా కుటుంబం ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యారు ఆమెకి ఆ దేశ పౌరసత్వం కూడా ఉందట. శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గం అయిన ఎప్పుడో క్రిస్టియన్ మతం తీసుకున్నారు.