Telugu News » సౌందర్యకు తీరని కోరిక ఉండేది.. ఆ కోరిక ఏమిటో తెలుసా…?

సౌందర్యకు తీరని కోరిక ఉండేది.. ఆ కోరిక ఏమిటో తెలుసా…?

by Sravya

దివంగత నటి సౌందర్య గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సౌందర్య టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి, మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో చాలామంది హీరోయిన్లు వచ్చారు వెళ్లిపోయారు. కానీ కొంతమంది మాత్రం ఎప్పటికీ అలా గుర్తుండిపోతారు. అటువంటి వాళ్ళలో సౌందర్య కూడా ఒకరు. ఆమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా ఉండేది. తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సౌందర్య గురించి చాలామందికి తెలియని ఒక విషయం బయటపడింది.

ఇండస్ట్రీ అంటే గ్లామర్ కి పెట్టింది పేరు కానీ సౌందర్యం మాత్రం వాటికి చాలా దూరంగా ఉండేది. నటిగా సామర్థ్యం ఉంటే తిరుగు ఉండదని సౌందర్య రుజువు చేసింది. చిన్న చిన్న పాత్రలతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సౌందర్య సూపర్ స్టార్ హీరోలు అందరితో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది.

Also read:

సౌందర్య ఎటువంటి పాత్ర పోషించిన చాలా సహజంగా సింపుల్గా అందరిని ఆకట్టుకుండేది. ఆమెకి సహజ నటి అనే బిరుదు కూడా వచ్చింది. హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. సౌందర్య కి మాత్రం ఒక తీరని కోరిక ఉండిపోయిందట. అదేంటంటే ఆమె ఒక్క సినిమాకైనా దర్శకత్వం వహించాలని అనుకున్నారట. కానీ అది తీరలేదు ఆ కోరిక తీరకుండానే సౌందర్య తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

You may also like

Leave a Comment