Telugu News » ప్రామిస‌రీ నోట్ రాసేటప్పుడు…ఈ విషయాలు తప్పక గుర్తుపెట్టుకోవాలి.. లేదంటే నష్టం మీకే…!

ప్రామిస‌రీ నోట్ రాసేటప్పుడు…ఈ విషయాలు తప్పక గుర్తుపెట్టుకోవాలి.. లేదంటే నష్టం మీకే…!

by Sravya
promissary-note-in-telugu

ఎప్పుడైనా సరే ఎవరైనా ఏదైనా మాట ఇచ్చేదానికంటే, ప్రామిసరీ నోటు ఉంటే మంచిది. ఒక్కొక్కసారి మనిషి ఇచ్చిన మాట తప్పచ్చు. కానీ ఒక ప్రామిసరీ నోట్ కనుక ఉన్నట్లయితే ఎలాంటి తప్పు చేయడానికి అవ్వదు. పైగా మోసపోకుండా ఉంటాము. అయితే ప్రామిసరీ నోటు రాయడానికి కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది ఆ ప్రామిసరీ నోటు చెల్లాలంటే కచ్చితంగా రూల్స్ పాటించాలి మరి ఆ రూల్స్ గురించి చూద్దాం. అప్పు ఇచ్చే వాళ్ళు అప్పు తీసుకునే వాళ్ళు ఇద్దరికీ కూడా పక్కాగా 18 ఏళ్లు నిండి ఉండాలి. లేదంటే ఆ ప్రామిసరీ నోటు పని చెయ్యదు.

ప్రామిసరీ నోట్ చెల్లే వ్యవధి మూడు ఏళ్ళు. ప్రామిసరీ నోటు తయారు చేసేటప్పుడు ఇస్తున్న వాళ్ళు తీసుకునేవారు అక్కడ ఉండాలి. అంతే కాకుండా నోట్ మీద రెవెన్యూ స్టాంప్ అంటించి ఇవ్వాలి. అలానే దానిపై అడ్డంగా సంతకం కూడా చేయాలి.
ఆ నోట్ మీద వుండే, రెవెన్యూ స్టాంప్ ధర మినిమం ఒక రూపాయి ఉండాలి. కోటి రూపాయల వరకు అప్పుగా ఇవ్వచ్చు.

Also read:

అలానే, ఎక్కువ మొత్తంలో డబ్బు లావాదేవీలు చేస్తుంటే మాత్రం న్యాయవాదిని కచ్చితంగా తీసుకెళ్లాలి. అలానే నోట్ మీద కచ్చితంగా ఇంత డబ్బు వీళ్ళ డాగర తీసుకున్న. ఈ టైం కి నేను తిరిగి ఇచ్చేస్తాను. ఈ పాయింట్ పక్కా ఉండాలి. ఇది లేకపోతే ఆ ప్రామిసరీ నోట్ వలన ఉపయోగం ఉండదు. మతిస్థిమితం లేని వ్యక్తులు ప్రామిసరీ నోటు రాస్తే కూడా చెల్లదు. అప్పు తీసుకున్న వ్యక్తి డబ్బును ఇవ్వకపోతే ఆ డబ్బుని ఈ నోట్ ద్వారా వసూలు చేయవచ్చు.

You may also like

Leave a Comment