Telugu News » మణిశర్మకు ఆఫర్లు రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారు..?

మణిశర్మకు ఆఫర్లు రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారు..?

by Sravya

మణిశర్మ అందరికీ సుపరిచితమే. ఈయన మ్యూజిక్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వరబ్రహ్మగా పేరుపొందారు మణిశర్మ. ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉంటూ ఎంతో మంచి మ్యూజిక్ ని అందిస్తున్నారు. తన మ్యూజిక్ తో మెస్మరైజ్ చేస్తూ సత్తాని చాటారు మణిశర్మ. రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అద్భుతమైన సంగీతాన్ని అందించారు. డబల్ స్మార్ట్, కన్నప్ప వంటి సినిమాలకి సంగీతాన్ని అందిస్తున్నారు. తమన్, దేవి శ్రీ ప్రసాద్ కి వచ్చినన్ని సినిమా ఆఫర్లు మణిశర్మ కి రావట్లేదు. అందుకే ఛాన్స్ల కోసం చాలామందిని అడుగుతున్నట్లు తెలుస్తోంది. తమన్, దేవిశ్రీల కంటే మణిశర్మ ప్రభావంతుడు అని అంతా అంటున్నారు.

Also read:

ఆయన కి అభిమానులు కూడా ఎక్కువ ఈయన వద్దనే శిష్యరికం చేసి నేడు ఆయనకే అవకాశాలు రాకుండా ఇండస్ట్రీని ఏలుస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. తమన్ ఇతర మ్యూజిక్ డైరెక్టర్ ల ట్యూన్స్ ని కాపీ కొట్టి మరీ హిట్లు కొడుతున్నారని కొంతమంది విమర్శిస్తున్నారు. తమన్ పై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఆయనకే అవకాశాలు ఇంకా ఇస్తున్నారని వీళ్ళకి బదులు మణిశర్మ ని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం.

చిరంజీవి హీరోగా వచ్చిన ఆచార్య సినిమాకి మణిశర్మ సంగీతం ఇచ్చారు మహేష్ బాబు రామ్ చరణ్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇలా చాలామంది స్టార్లు ఇప్పటికే మణిశర్మ కి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఒకప్పుడు వీళ్ళందరికీ మ్యూజిక్ హిట్స్ ని ఇచ్చారు మణిశర్మ కానీ ఇప్పుడు ఆయనకి అస్సలు ఛాన్స్ ఇవ్వట్లేదు అని ఆయన బాధపడుతున్నారు. మణిశర్మ కి టాలీవుడ్ లో తప్ప మరి ఏ ఇండస్ట్రీలో పెద్దగా పరిచయాలు కూడా లేవు ఇతర భాషా సినిమాలకి మ్యూజిక్ ఇవ్వరు అందువలన కేవలం టాలీవుడ్ మీద మణిశర్మ ఆధారపడిపోయారు.

You may also like

Leave a Comment