Telugu News » CM Jagan : చంద్రబాబు, గజ దొంగల ముఠాకు సమాధానం చెప్పాల్సి రావడం దౌర్భాగ్యం….!

CM Jagan : చంద్రబాబు, గజ దొంగల ముఠాకు సమాధానం చెప్పాల్సి రావడం దౌర్భాగ్యం….!

చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని అన్నారు. పక్క రాష్ట్రంలో నివసిస్తున్న పవన్ కళ్యాణ్, పురందేశ్వరిలు స్టార్ క్యాంపెనర్లే అంటూ విమర్శలు గుప్పించారు.

by Ramu
YS Jagan: Believing Chandrababu is like waking up Chandramukhi: Jagan

టీడీపీ అధినేత (TDP Chief) చంద్రబాబు (Chandra Babu)ది చెడు చేసిన చరిత్ర అంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని అన్నారు. పక్క రాష్ట్రంలో నివసిస్తున్న పవన్ కళ్యాణ్, పురందేశ్వరిలు స్టార్ క్యాంపెనర్లే అంటూ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, గజ దొంగల ముఠాకు సమాధానం చెప్పాల్సి రావటం దౌర్భాగ్యమని మండిపడ్డారు.

cm jagan has once again spoken against chandrababu anantapur andhrapradesh

రాష్ట్రాన్ని అడ్డంగా విభజించిన కాంగ్రెస్‌లో చంద్రబాబు స్టార్ క్యాంపెనర్లు ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబు కోసం పనిచేసే స్టార్ క్యాంపెయినర్లు మేధావులుగా ఫీలవుతున్నారని ఫైర్ అయ్యారు. ‘ప్రతి పేద ఇంటికీ సంక్షేమ ఫలాలను అందిస్తున్న మీ బిడ్డకు స్టార్ క్యాంపెనర్లు లేరు. మీ బిడ్డకు ఉన్న స్టార్ క్యాంపెనర్లు మీరే’ అని సీఎం అన్నారు.

ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఒక రికార్డు అని చెప్పారు. గతంలో అంతా లంచాలమయమన్నారు. కానీ ఇప్పుడు ఎక్కడా కులం, మతం, ప్రాంతం, వర్గం.. చివరకు ఏ పార్టీ అని చూడకుండా, ఓటు వేయకపోయినా పర్వాలేదని.. అర్హతను ప్రామాణికంగా తీసుకుని లబ్ధి చేకూరుస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో 56 నెలల కాలంలో జరిగిన మంచిపై చాలా సంతోష పడుతున్నామన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కనిపించనంత తేడా ఏపీలో కనిపిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నామని.. వైఎస్సార్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నామని వివరించారు. డ్వాక్రా మహిళల ఖాతాల్లో కోట్లు జమ చేశామన్నారు. మహిళలు బాగుంటేనే రాష్ట్రం ముందడుగులో ఉంటుందన్నారు.

‘పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ కింద రూ.4,968 కోట్లు అందించాం. ఆసరా, సున్నా వడ్డీ కింద రూ.31 వేల కోట్లు చెల్లించాం. 56 నెలల కాలంలో అక్కాచెల్లెమ్మలకు రూ.2.53 లక్షల కోట్లు అందజేశాం. జగనన్న అమ్మఒడి కింద రూ.26,067 కోట్లు, వైఎస్సార్ ఆసరా కింద రూ.25,571 కోట్లు, వైఎస్సార్ చేయూత కింద రూ. 14,129 కోట్లు అందించాం’అని సీఎం జగన్ వెల్లడించారు

You may also like

Leave a Comment