చాలా సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్ లో షాపింగ్ పూర్తి అయ్యిన తరువాత బిల్లింగ్ చేసేటప్పుడు కచ్చితంగా మొబైల్ నెంబర్ చెప్పాలి అని కోరుతారు. అలా మొబైల్ నెంబర్ చెప్తేనే వాళ్ళు బిల్ ఇవ్వగలమని.. లేదంటే బిల్ చేయలేమని చెప్పేస్తూ ఉంటారు. ఇదంతా ఇప్పుడు సర్వ సాధారణం అయిపొయింది. ఇక కస్టమర్లు కూడా ఇదేదో మామూలు విషయమే అన్నట్లు ఫోన్ నంబర్స్ ను ఇచ్చేస్తున్నారు. కానీ, ఇది బలవంతంగా ఫోన్ నెంబర్ తీసుకోవడమే అవుతుంది.
అసలు ఇలా ప్రతి కస్టమర్.. ప్రతి షాప్ లోను ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నిజానికి ఇది కన్స్యూమర్ ప్రొటెక్షన్ చట్టానికి వ్యతిరేకం అని మినిస్ట్రీ ఆఫ్ కన్సూమర్స్ చెబుతోంది. కస్టమర్ తానూ ఇవ్వదలుచుకోకపోతే.. ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పడు సిస్టం ఎలా వచ్చేసింది అంటే.. బలవంతంగా అయినా సరే ఫోన్ నెంబర్ ను తీసుకుంటున్నారు.
ఇలా ఫోన్ నంబర్స్ ని ఇచ్చేయడం వలన మీ నెంబర్ హకెర్స్ దగ్గరకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్న అడ్వాన్స్డ్ సైబర్ ప్రపంచంలో చాలా మంది మోసాలు చేస్తున్నారు. సైబర్ వలలో చిక్కుకోకుండా ఉండాలంటే, సైబర్ నేరగాళ్లకు దూరంగా ఉండాలంటే మొబైల్ నంబర్స్ ను ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేయకండి. చాలా మంది ఇంత దూరం ఆలోచించకుండా.. ఎక్కడ అడిగితే అక్కడ మొబైల్ నంబర్స్ ఇచ్చేస్తూ ఉంటారు.