Telugu News » Durgam Cheruvu : మాదక ద్రవ్యాలు..కేరాఫ్ దుర్గం చెరువు

Durgam Cheruvu : మాదక ద్రవ్యాలు..కేరాఫ్ దుర్గం చెరువు

by umakanth rao
durgam cheruvu 2

Durgam Cheruvu : హైదరాబాద్ (Hyderabad) నగరానికి ఒకప్పుడు తలమానికంగా ఉన్న దుర్గం చెరువు కాలుష్య భూతంలో చిక్కుకుంటోంది. క్రమంగా అనేక కలుషితాలతో నిండిపోతోంది. ప్లాస్టిక్ కవర్లు, హానికరమైన రసాయనాలు, చివరకు కొకైన్ వంటి మాదకద్రవ్యాలతో ఈ చెరువు కాలుష్య కాసారంగా మారుతోంది. మహీంద్రా యూనివర్సిటీ, ఇండియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ కు చెందిన నిపుణులు నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ షాకింగ్ విషయం వెల్లడైంది. ‘నాన్ టార్గెట్ స్క్రీనింగ్ ఆఫ్ ఆర్గానిక్ మైక్రోపొల్యుటెంట్స్ ఇన్ దుర్గం చెరువు లేక్’ పేరిట వీరు తమ స్టడీ పేపర్ ను విడుదల చేశారు.

 

Visiting Durgam Cheruvu? Better get a gas mask first- The New Indian Express

 

ఈ చెరువు నుంచి గత మార్చిలో మూడు నీటి శాంపిల్స్ సేకరించి వాటిని అధ్యయనం చేశారు. మహీంద్రా యూనివర్సిటీకి చెందిన శ్రీకృష్ణ దుద్దుపూడి నేతృత్వంలో ఈ స్టడీని నిర్వహించారు. ఈ నీటిలో ఆర్గానిక్ సంబంధమైన 183 కాంపౌండ్స్ ఉన్నట్టు గుర్తించారు. వీటిలో ఫార్మాస్యుటికల్స్, హెర్బిసైడ్స్, ఫంగిసైడ్స్, స్టెరాయిడ్స్, పెస్టిసైడ్స్, యువీ ఫిల్టర్స్, సైనోటాగ్జిన్స్, మెటాబొలైట్స్ వంటి హానికారక పదార్థాలున్నట్టు ఈ విశ్లేషణలో తేలింది. ఇవన్నీ మనుషులకు, జంతువులకు అతి ప్రమాదకరమైనవి.

మాదాపూర్, జూబిలీ హిల్స్ తదితర చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇళ్ళు, పారిశ్రామిక సంస్థల నుంచి వచ్చే వృధా నీరు ఈ చెరువులో కలుస్తోందని నగర పర్యావరణ వేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. సిటీలోని సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కేవలం సెట్లింగ్ ట్యాంక్ ని మాత్రమే వినియోగిస్తాయని, కానీ మాదక ద్రవ్యాలను , ఈ విధమైన కాలుష్య కారకాలను తొలగించ జాలవని నరసింహా రెడ్డి అనే నిపుణుడు చెప్పారు.

ఈ కలుషిత జలాలు భూగర్భ జలాల కాలుష్యానికి కూడా కారణమవుతున్నాయన్నారు. ఈ చెరువు చుట్టుపక్కల గల ఆసుపత్రులు తమ వృధా ప్రాడక్టులు ఈ చెరువులోకి చేరకుండా చూడాల్సి ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణపై లండన్ లో ఈ వారం జరిగే 13 వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లో నిపుణులు తమ అధ్యయన పత్రాన్ని సమర్పించనున్నారు.

 

You may also like

Leave a Comment