Telugu News » రవితేజ ఈగల్ మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే!

రవితేజ ఈగల్ మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే!

ఈగల్ మూవీ ఫస్ట్ రివ్యూ

by Sri Lakshmi

టాలీవుడ్ హీరో, మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా కోసం రవితేజ అభిమానులు ఈగర్ గా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో ఈ మూవీ యూనిట్ ఇటీవల ఈ సినిమాను చూసారు. రవితేజ ఈ సినిమా చూసిన వెంటనే ఫుల్ ఎగ్జైట్ అయ్యారట. ఫుల్ శాటిస్ఫైడ్ అంటూ తన సినిమాలో తనకే రివ్యూ ఇచ్చేసుకున్నారట. ఆ ఒక్క మాటతో సినిమా చాలా బాగుంది అని రవితేజ చెప్పకనే చెప్పేసారు.

రవితేజ నోటి నుంచే ఈగల్ సినిమా రివ్యూ కూడా వచ్చేసింది. మరో వైపు దర్శక నిర్మాతలు కూడా ఈ సినిమాను చూసి సంతృప్తిగా ఫీల్ అయ్యారట. వారి ఫేసెస్ లో ఆ హ్యాపీనెస్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో రవితేజ పరిస్థితి ఒక హిట్ కొడితే.. నాలుగు ఫ్లాప్స్ అన్నట్లు సాగుతోంది. ధమాకా తరువాత ఆయనకు మళ్ళీ హిట్ పడలేదు. క్రాక్ సినిమా విజయం తరువాత వరుస సినిమాలతో దూసుకొచ్చిన రవితేజకు సరైన హిట్స్ మాత్రం పడలేదు.

రావణాసుర, టైగర్ నాగేశ్వర్రావు, రామారావు ఆన్ డ్యూటీ.. ఇలా అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతూనే వచ్చాయి. ఇప్పుడు రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా వచ్చేస్తోంది. ఈ సినిమా రిజల్ట్ పై రవితేజ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతికే విడుదల అవ్వాల్సి ఉంది. కానీ అప్పుడు రిలీజ్ డేట్స్ లేకపోవడంతో పీపుల్స్ మీడియా ఈ సినిమా రిలీజ్ ను వాయిదా వేసింది. సంక్రాంతి పోటీ అప్పటికీ ఎక్కువ గా ఉండడంతో.. దాన్ని మరింత పెంచడం ఇష్టం లేకే తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. మొత్తానికి ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని రవితేజతో పాటు మూవీ యూనిట్ బలంగా విశ్వసిస్తోంది.

You may also like

Leave a Comment