Telugu News » Elon Musk: ‘హెల్ప్ ‌మీ బ్రదర్..’ సత్య నాదెళ్లకు ఎలాన్ మస్క్ మెసేజ్…!

Elon Musk: ‘హెల్ప్ ‌మీ బ్రదర్..’ సత్య నాదెళ్లకు ఎలాన్ మస్క్ మెసేజ్…!

టెస్లా యజమాని ఎలోన్ మస్క్(Elon Musk) స్వయంగా కొత్త విండోస్ ల్యాప్‌టాప్ పీసీ(Windows Laptop PC)ని కొనుగోలు చేశాడు. అందులో తనకొచ్చిన సమస్యను నేరుగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు మెసేజ్ చేశానని చెప్పాడు.

by Mano
Elon Musk: 'Help me brother..' Elon Musk's message to Satya Nadella...!

టెస్లా యజమాని ఎలోన్ మస్క్(Elon Musk) స్వయంగా కొత్త విండోస్ ల్యాప్‌టాప్ పీసీ(Windows Laptop PC)ని కొనుగోలు చేశాడు. అయితే అందులో తనకొచ్చిన సమస్యను నేరుగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల(Microsoft CEO Satya Nadella)కు మెసేజ్ పంపి చెప్పుకున్నారు. మస్క్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది.

Elon Musk: 'Help me brother..' Elon Musk's message to Satya Nadella...!

ఇందులో చాలా మంది విండోస్ యూజర్లు  ఆ సమస్య పరిష్కారానికి మస్క్‌కు సూచనలు చేశారు. ‘టెక్నికల్ సపోర్ట్ కోసం సత్య నాదెళ్లకు కాల్ చేయండి..’ అని ఒకరు తెలపగా.. దానికి మస్క్ ఇప్పటికే అతడికి మెసేజ్ చేశానని సమాధామిచ్చాడు. వ్యక్తిగత కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో బేసిక్ ఫంక్షనాలిటీ కోసమూ మైక్రోసాఫ్ట్ ఖాతాను సృష్టించాల్సిన అవసరాన్ని మస్క్ విమర్శించారు.

గోప్యత కోసం ఏర్పాటు చేసిన ఈ ఫీచర్ గందరగోళంగా ఉందన్నాడు. మస్క్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఇలా రాసుకొచ్చాడు.. ‘‘అంటే నా కంప్యూటర్‌లో అతడి ఏఐకి నేను యాక్సెస్ చేస్తాను. ముందుగా సైన్ ఇన్ చేయడానికి ‘స్కిప్’ చేయడానికి లేదా ‘మైక్రోసాఫ్ట్ ఖాతా’ని సృష్టించడానికి ఒక ఎంపిక ఉంది.’’ అని తెలపాడు.

దానికి మైక్రోసాఫ్ట్ ఖాతాను సృష్టించకుండానే నా Windows ల్యాప్టాప్ PCని తెరవగలనని ఒక యూజర్ కామెంట్ చేశాడు. దీన్ని ప్రయత్నించిన మస్క్ ఫలితాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ‘ఎట్టకేలకు ఇది విజయవంతమైంది, ధన్యవాదాలు. నా ల్యాప్‌టాప్ పాస్‌వర్డ్ లేకుండా స్వయంచాలకంగా స్థానిక Wi-Fiకి కనెక్ట్ చేయబడింది. దీని తర్వాత, నేను ఎంపికను తీసివేయి ఎంపికపై క్లిక్ చేసి, లాగిన్‌ను దాటవేసాను.’ అంటూ రాసుకొచ్చాడు.

You may also like

Leave a Comment