Telugu News » Hanuman review: హనుమాన్ మూవీ ఫస్ట్ రివ్యూ.. సినిమా హిట్ అవుతుందా..?

Hanuman review: హనుమాన్ మూవీ ఫస్ట్ రివ్యూ.. సినిమా హిట్ అవుతుందా..?

by Sravya
Hanuman-Review

తేజ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి వచ్చి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు తేజ. సంక్రాంతి బరిలోకి తేజ హనుమాన్ సినిమాతో రాబోతున్నాడు ఈసారి పండక్కి ఫ్యామిలీస్ అందరూ కూడా మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారం సినిమాని ఎక్కువ చూసి అవకాశం ఉంది. అయితే సంక్రాంతి బరిలో తేజ హనుమాన్ సినిమా కూడా ఉంది. ఈ మూవీ టీజర్ ట్రైలర్ కూడా అద్భుతంగా ఉన్నాయి అని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలని చెప్పారు. సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత సినిమా యూనిట్ నుండి వస్తున్న సమాచారం ఏంటంటే సినిమా ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని తెలుస్తోంది.

Hanuman-Review

 

సెకండ్ హాఫ్ ని కొంచెం డల్ గా తీసినట్లు కనపడుతోందని వార్తలు అయితే వచ్చాయి. సెకండ్ హాఫ్ లో సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో సంక్రాంతి పోటీలో హనుమాన్ సినిమా ఉంది. ఇలాంటి క్రమంలో సినిమా రిలీజ్ కి ముందే సెకండ్ హాఫ్ డౌన్ అయినట్లు అనిపిస్తుంది అని వార్తలు వస్తుంటే, సినిమాకి ఇది పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. పైగా ఈ సినిమాని ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారు అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. ఇలాంటి క్రమంలో ఈ న్యూస్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుండడం వలన సినిమాని కొంతవరకు దెబ్బతిసే ప్రమాదం ఉంది.

సంక్రాంతి పోటీలో ఏ కొంచెం డివైడెడ్ టాక్ వచ్చినా కానీ మిగతా సినిమాలో ఈ మూవీ ని డామినేట్ చేసే ఛాన్స్ ఉంది. మరోపక్క మహేష్ బాబు స్టార్ హీరో. పైగా మహేష్ బాబుకి క్రేజ్ కూడా బాగా ఉంది. గుంటూరు కారం సినిమా ఫ్యామిలీకి సంబంధించిన స్టోరీ కనుక ప్రేక్షకులు అందరూ దానిమీద ఫోకస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుంటూరు కారం కలెక్షన్లు ఎక్కువ వస్తాయి కాబట్టి హనుమాన్ సినిమా కచ్చితంగా డౌన్ అవుతుంది అని తెలుస్తోంది. గుంటూరు కారం సినిమా అలానే ఇతర సినిమాలు ఉండడం వలన భారీ ఎఫెక్ట్ హనుమాన్ మీద పడే అవకాశం వుంది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చదవండి ! తెలుగు న్యూస్ కోసం ఇవి చదవండి !

You may also like

Leave a Comment