Telugu News » Hardhik Pandya: ఆ మైదానం నాకు గుడితో స‌మానం: టీమిండియా ఆల్‌రౌండర్

Hardhik Pandya: ఆ మైదానం నాకు గుడితో స‌మానం: టీమిండియా ఆల్‌రౌండర్

టీమిండియా ఆల్‌రౌండర్(Team India All Rounder) హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) కాలి మ‌డ‌మ మ‌డ‌త‌ప‌డ‌డంతో మైదానాన్ని వీడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పాండ్యా నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ మొద‌లెట్టాడు. బ‌రోడా క్రికెట్ స్టేడియంలో బౌలింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేశాడు.

by Mano
Hardhik Pandya: That ground is like a temple for me: Team India all-rounder

గతేడాది సొంత‌గ‌డ్డ‌పై జ‌రిగిన‌ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌(ODI World Cup 2023)లో బంగ్లాదేశ్‌పై బౌలింగ్ చేస్తుండగా టీమిండియా ఆల్‌రౌండర్(Team India All Rounder) హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) గాయ‌పడిన సంగతి తెలిసిందే. ఎడ‌మ కాలి మ‌డ‌మ మ‌డ‌త‌ప‌డ‌డంతో మైదానాన్ని వీడిన పాండ్యా ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నాడు.

Hardhik Pandya: That ground is like a temple for me: Team India all-rounder

అంతేకాదు.. నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ మొద‌లెట్టాడు. బ‌రోడా క్రికెట్ స్టేడియం(baroda cricket stadium)లో పాండ్యా నెట్స్‌లో పాండ్యా చెమ‌టోడుస్తున్నాడు. అక్కడ బౌలింగ్ చేస్తున్న‌ వీడియోను పాండ్యా ఎక్స్‌లో షేర్ చేశాడు. ‘ప్ర‌తి రోజు నా శ‌క్తినంతా ధార‌పోస్తున్నా’ అని ఆ వీడియోకు పాండ్యా క్యాప్ష‌న్ ఇచ్చాడు.

‘నాకెంతో ఇష్ట‌మైన చోటుకు వ‌చ్చినందుకు సంతోషంగా ఉంది. బ‌రోడా గ్రౌండ్ నాకు ఒక దేవాల‌యం లాంటింది. ఎందుకంటే.. ఇదే మైదానంలో నేను చాలా విష‌యాలు నేర్చుకున్నా. 17 ఏళ్ల కిందట క్రికెట‌ర్‌గా నా జ‌ర్నీ ఇక్క‌డే మొద‌లైంది. మ‌ళ్లీ ఇక్క‌డికి వ‌చ్చినందుకు సంతోషంగా ఉంది’ అని పాండ్యా రాసుకొచ్చాడు.

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో పాండ్యా ఆడే అవకాశముంది. దీంతో అభిమానులు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆల్‌రౌండ‌ర్ కొర‌త తీరిన‌ట్టేన‌ని ఖుషీ అవుతున్నారు. ఐపీఎల్ 16వ సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌ను ఫైన‌ల్‌కు చేర్చిన పాండ్యాను 17వ సీజ‌న్‌కు ముందు ముంబై ఇండియ‌న్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. రోహిత్ శ‌ర్మ‌ను కెప్టెన్‌గా త‌ప్పించి అత‌డికి బాధ్య‌త‌లు అప్ప‌గించింది. గాయం నుంచి కోలుకుని పాండ్యా ఇప్పుడు నెట్స్‌లోప్రాక్టీస్ మొద‌లెట్టాడు.

You may also like

Leave a Comment