ఊపిరితిత్తులు (Lungs).. మనుషులకు ఉన్న అవయవాలులో ఇదొక ఇంపార్టెంట్ పార్ట్.. కానీ వాయు కాలుష్యం ప్రభావంతో వీటి పనితీరు మందగించి వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నారు ప్రజలు.. వీటికి తోడు కరోనా (Corona) ప్రభావం కూడా ఊపిరితిత్తుల పై ఎక్కువగా పడింది. మరోవైపు చలికాలం (winter) వాతావరణంలో మార్పులు కూడా ఊపిరితిత్తుల పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
ఇలాంటి సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్స్ (Infections)వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అని చాలామంది మదిలో ప్రశ్న పుడుతుంది. ఈ ప్రశ్నకు ఆరోగ్య నిపుణులు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసుకుందాం..
తేనె ఆరోగ్యానికి దివ్య ఔషదం అని అందరికీ తెలుసు.. కానీ స్వచ్ఛమైన తేనెలో మాత్రం ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇలాంటి తేనెను ఒక స్పూన్ తీసుకుని గోరు వెచ్చటి నీటిలో కలుపుకొని రోజు తాగడం వల్ల శరీరంలో చెడు వ్యర్థాలు తొలగడమే కాదు శరీరంలోని వేడిని కూడా తగ్గిస్తాయని, కఫాన్ని కరిగించడంలో కూడా తేనె దోహద పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పుదీనా ఆకులకు కూడా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ తొలిగించే గుణం ఉంది. పుదీనా ఆకులను మరిగించి ఆవిర్లు పట్టినా.. లేదా పుదీనా వేడి నీటిని టీ లాగా తీసుకున్న ఊపిరితిత్తులకు వచ్చే రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. పుదీనా నీటిని తాగితే… గొంతులో మంట, గరగర వంటివి పోయి.. గొంతు చల్లగా అవడం వల్ల రిలీఫ్ లభిస్తుందని తెలుపుతున్నారు.
అల్లం టీ ఇది కూడా రోగనివారిణిగా పనిచేస్తుంది. అల్లం టీ మితంగా తీసుకోవాలి.. లేదా వేడిపాలలో కొద్దిగా పసుపు వేసుకొని తేనె కలుపుకుని తాగాలి. ఇది జలుబు, దగ్గును తగ్గిస్తుందని.. ఊపిరితిత్తులకు గాలి బాగా వెళ్లేలా చేస్తుందని.. అందువల్ల ఊపిరితిత్తుల పని తీరు మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఓ కప్పు నీటిలో… 2 యాలకులు, ఓ చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి… 10 నిమిషాలు వేడి చేసి తాగితే… బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటుందని.. హైబీపీ తగ్గుతుందని.. ఇది ఊపిరితిత్తులకు కూడా మేలు చేస్తుందని హెల్త్ ప్రొఫెషనల్స్ చెబుతున్నారు.
ఇక పాలతో చేసిన టీ కంటే గ్రీన్ టీ తాగితే… ఆరోగ్యానికి మంచిదని వారు అంటున్నారు.. ప్రతి రోజూ ఉదయాన్నే ఓ కప్పు గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకుంటే… బాడీకి యాంటీ-ఆక్సిడెంట్స్ బాగా అంది ఇవి ఆరోగ్యాన్ని అన్ని విధాలా కాపాడుతాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు.
సగం యాపిల్, చిన్న బీట్ రూట్ , ఓ క్యారెట్ తీసుకుని ముక్కలుగా చేసి, మిక్సీలో గ్రైండ్ చేసి.. జ్యూస్‌లా తాగడం వల్ల వీటిలో ఉండే విటమిన్ సీ, ఈ, పొటాషియం శరీరానికి అంది ఆస్తమా, జలుబును తగ్గిస్తాయని హెల్త్ ప్రొఫెషనల్స్ అంటున్నారు.. ఊపిరితిత్తుల సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం వైద్యులను తప్పని సరిగా సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ విషయాలు చెప్పడం జరిగింది.. వీటిని ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి..