కొంతమంది స్టార్ హీరోయిన్లు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. కుటుంబం కోసం ఎన్నో వదులుకున్నారు. అలా త్యాగం చేసిన హీరోయిన్ల వివరాలను ఇప్పుడు చూద్దాం.
ఊహ:
ఊహ మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు కేవలం తెలుగులోనే కాకుండా తమిళ కన్నడ మలయాళ సినిమాల్లో కూడా ఊహ నటించారు. తర్వాత 1997లో శ్రీకాంత్ ని ఊహ పెళ్లి చేసుకున్నారు. తర్వాత సినిమాలు చేయలేదు.
నమ్రత:
నమ్రత కూడా ఫ్యామిలీ కోసం ఎంతో ఇష్టమైన నటనని వదులుకున్నారు. మహేష్ ని ఈమె పెళ్లి చేసుకున్నారు పెళ్లి అయిన తర్వాత నుండి కూడా ఆమె సినిమాలకి దూరంగా ఉన్నారు. కుటుంబం కోసం ఈమె తన జీవితాన్ని త్యాగం చేశారు.
Also read:
అసిన్:
హీరోయిన్ అసిన్ కూడా తెలుగు తో పాటుగా తమిళ, హిందీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. మైక్రోమ్యాక్స్ సంస్థ సీఈవో రాహుల్ శర్మని పెళ్లి చేసుకున్నారు ఈమె. ఆ తర్వాత ఈమె సినిమాలకి దూరమైపోయారు.
కీర్తి రెడ్డి:
ఈమె హిందీ తో పాటుగా తెలుగు తమిళ కన్నడ సినిమాల్లో కూడా నటించారు అక్కినేని సుమంత్ ని ఈమె పెళ్లి చేసుకున్నారు. తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయారు. సినిమాలకి దూరమయ్యారు.
రేణు దేశాయ్:
రేణు దేశాయ్ అందరికీ సుపరిచితమే. ఈమె కూడా చాలామంది నటులు లాగే పెళ్లి తర్వాత సినిమాలకి దూరమయ్యారు. పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్నాక సినిమాల్లో నటించలేదు కానీ ఈ మధ్య రీ ఎంట్రీ ఇచ్చారు.
లయ:
లయ కూడా పెళ్లి తర్వాత సినిమాలకి దూరమయ్యారు. సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా లయ నటించి తర్వాత పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయారు.
రంభ:
హీరోయిన్ రంభ కూడా తన కుటుంబం కోసం సినిమాలను వదులుకున్నారు పెళ్లి తర్వాత రంభ సినిమాల్లో నటించలేదు.
శిల్పా శెట్టి:
ఈమె రాజ్ కుంద్రా ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే ఆ తర్వాత ఈమె పర్సనల్ లైఫ్ లో బిజీగా ఉండిపోయి సినిమాలకి బాగా దూరం అయిపోయారు.