రాష్ట్రంలో ఐపీఎల్ (IPL) సందర్భంగా క్రికెట్ బెట్టింగ్ (Cricket Betting) దందా జోరుగా సాగుతుంది.. ఈ ఆట మీద ఉన్న పిచ్చి ఒకవైపు కాగా.. పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందనే ఆశతో కొందరు బెట్టింగ్ పై ఆసక్తి చూపిస్తున్నారు.. ఈ నేపథ్యంలో రోజు కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని సమాచారం.. కాగా ఈ ఉచ్చులో పడి కొందరు ఆర్థికంగా దివాళా తీస్తున్న ఘటనలు సైతం చోటు చేసుకొంటున్నాయి..

మరోవైపు హైదరాబాద్ (Hyderabad) శివారు ప్రాంతాలను అడ్డాగా చేసుకొని బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఈ ముఠా.. ప్రతిరోజు కోట్ల రూపాయాల బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు పోలీసులు (Police) దర్యాప్తులో గుర్తించారు.. ఇలాంటి చర్యల వల్ల మంచి కుటుంబాలు సైతం రోడ్డున పడుతాయని తెలిపిన వారు.. ఎవరైనా బెట్టింగ్ పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.