Telugu News » అందం కోసం బ్యూటీ పార్లర్ కి వెళితే…పాపం..!

అందం కోసం బ్యూటీ పార్లర్ కి వెళితే…పాపం..!

by sai krishna

కొండనాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందని..సామెత.! అందం కోసం పార్లర్ కి పోతే ఓ మహిళకి ఉన్నజుట్టు ఊడిపోయిందట. ఇకపై వస్తుందన్న నమ్మకం కూడా లేదట.

అందిన సమాచారం ప్రకారం…తనని మోడల్‌గా చూడాలనుకున్న భర్త కోరికను తీర్చడానికి ఓ మహిళ చేసిన ప్రయత్నం తల్లకిందులైంది. ఓల్డ్ సిటీకి చెందిన ఓ మహిళ అందంగా.. స్టైల్‌గా కనిపించడం కోసమని పొడుగ్గా ఉన్న జుట్టుని కట్ చేయించుకోవడానికి హైదరాబాద్ అబిడ్స్ లో ఒక బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది.

 

అక్కడి బ్యూటీషియన్ అద్భుతమైన ఆయిల్ అంటూ జుట్టుగా ఏదో రాసింది.జుట్టు కట్ చేసింది. కట్ చేస్తే.. ఆయిల్ పెట్టిన కాసేపటికే జుట్టు ఊడిపోవడం స్టార్ట్ అయ్యింది. కాసేపటికే ఆమె నెత్తిమీదున్న జుట్టు మొత్తం ఊడిపోయి..కీమో థెరఫీ పేషెంట్ లా అయిపోయింది.

నెత్తిపై ఉన్న జుట్టు మొత్తం రాలిపోవడంతో భయపడి ఇంటికి పరుగులు తీసింది. పార్లర్ కి వెళ్లి తన భార్య బ్యూటీ క్వీన్ లా తిరుగొస్తుందనుకున్న భర్త కలలన్నీ మురిక్కాలువలో పడ్డ ఐస్ క్రీమ్ లా అయిపోయాయి.

భార్య నెత్తిన అందానికైన వెంట్రుక కూడా లేకపోవడం చూసిన ఆ భర్త షాక్‌ అయ్యాడు. నీ వల్లే ఇలా నా జుట్టుకీ గతిపట్టిందని భార్య భర్తను నిలదీసింది. నిన్నెవడు ఆ పార్లర్ కి వెళ్లమన్నాడని అతనన్నాడు..అప్పటి దాకా హాయిగా కలిసి కాపురం చేసుకున్న భార్యా భర్తలిద్దరు బద్ధ శత్రువుల్లా తగవులాడుకున్నారు.

చివరిగా భర్త నీ జుట్టున్న కాడ చెప్పుకో అని తెగేసి చెప్పాడు. పాపం కదా..! మనలో మన మాట..బట్టతల ఉన్న మగాణ్ణి ఒక కోణంలో మేధావిగా చూస్తుంది కానీ…జుట్టులేని ఆడదాన్ని ఎగతాళి చేస్తుందీ సమాజం.

భర్తపై అరిచినా జుట్టు రాదని తెలుసుకున్న బాధితురాలు నేలరాలిన జుట్టుతో పోలీస్ స్టేషన్ కి వెళ్లింది.బ్యూటీ పార్లర్‌పై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జుట్టు లేక చాలా మంది రకరకాలు నూనెలు వాడుతున్నారు.

ఈ మహిళ ఉన్న జుట్టుని కట్ చేయించు కోడానికి పార్లర్ కి వెళ్లింది. ఏదైనా ఉన్నప్పుడు కాదు, లేనప్పుడే ఆ బాధ తెలుస్తుంది.ఇప్పుడు ఆమె కంప్లైంట్ తో పోలీసులు తలలు పట్టుకున్నారు. థాంక్ గాడ్ వాళ్లకి జుట్టుంది.!

You may also like

Leave a Comment