Telugu News » IPL 2024: ఐపీఎల్‌లోకి ‘సిక్సర్ల సిద్దూ’.. మైదానంలో ఇక మాటల హోరే..!

IPL 2024: ఐపీఎల్‌లోకి ‘సిక్సర్ల సిద్దూ’.. మైదానంలో ఇక మాటల హోరే..!

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో సిద్ధూ కామెంటేట‌ర్‌గా అల‌రించ‌నున్నాడు. ఐపీఎల్‌లో స్టార్ స్పోర్ట్స్ త‌ర‌ఫున‌ సిద్దూ కామెంటేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఈ విష‌యాన్ని ఆ సంస్థ మంగ‌ళ‌వారం ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించింది.

by Mano
IPL-2024: 'Sixers Siddhu' into IPL.. No more words on the field..!

ఐపీఎల్-2024(IPL-2024) కోసం ప్ర‌పంచ‌మంతా ఎదురుచూస్తోంది. ఈనెల 22న ప్రారంభమయ్యే మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రతీసారి మైదానంలో క్రికెటర్లతో పాటు కామెంటరీ రూమ్‌లో మాజీ క్రికెటర్లు సందడి చేస్తుంటారు. వెట‌ర‌న్స్ సునీల్ గ‌వాస్క‌ర్(Sunil Gavaskar), ర‌వి శాస్త్రి, అనిల్ కుంబ్లేలు కామెంటేట‌ర్స్‌గా ఫ్యాన్స్‌ను ప‌ల‌క‌రిస్తున్నారు.

IPL-2024: 'Sixers Siddhu' into IPL.. No more words on the field..!

అయితే, వీళ్ల జాబితాలో ఇప్పుడు సిక్సర్ల సిద్దూ వచ్చి చేరాడు. ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో నవజ్యోత్‌సింగ్ సిద్దూ (Navjot Singh Sidhu) కామెంటేట‌ర్‌గా అల‌రించ‌నున్నాడు. ఐపీఎల్‌లో స్టార్ స్పోర్ట్స్ త‌ర‌ఫున‌ సిద్దూ కామెంటేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఈ విష‌యాన్ని ఆ సంస్థ మంగ‌ళ‌వారం ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించింది. అంతేకాదు సిద్దూను ‘స‌ర్ధార్ ఆఫ్ కామెంటరీ బాక్స్‌’గా అభివ‌ర్ణించింది. సిద్దూ 2001లో భారత్, శ్రీలంక పర్యటనలో సిద్ధూ కామెంటరీ చేశారు.

తన విలక్షణమైన మాటలతో అందరిని అలరించారు. చమత్కారమైన మాటలకు ప్రసిద్ధి చెందిన సిద్ధూ.. ఐపీఎల్ 2024లో ఎలా అలరిస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాను ఆడిన రోజుల్లో భారతదేశపు అత్యంత స్టైలిష్ క్రికెటర్లలో ఒకడిగా సిద్ధూ పేరుగాంచారు. టీమిండియా మాజీ క్రికెట‌ర్ అయిన‌ సిద్ధూ 1983 నుంచి 1998 వరకు భారత్ తరపున ఆడాడు. అంత‌ర్జాతీయంగా 187 మ్యాచ్‌లు ఆడాడు.

15 సంవత్సరాల కెరీర్‌లో 51 టెస్టులు, 136 వన్డేలు ఆడిత‌న ట్రేడ్ మార్క్ ఇన్నింగ్స్‌ల‌తో ఫ్యాన్స్‌ను అల‌రించిన అత‌డు 7,615 ప‌రుగులు సాధించాడు. ఆట‌కు దూర‌మ‌య్యాక రాజ‌కీయాల్లో బిజీగా ఉన్న‌ సిద్దూ.. ఇప్పుడు మ‌ళ్లీ త‌న మాట‌లతో స్టేడియాన్ని హోరెత్తించ‌నున్నాడు.సిద్ధూ 15 సెంచరీలు, 48 అర్ధ సెంచరీలు చేశాడు.

అయితే, 1988 నాటి ఓ కేసు విషయంలో నవజ్యోత్‌సింగ్ సిద్దూ ఏడాదిపాటు జైలు శిక్ష అనుభవించారు. 2023 ఏప్రిల్‌లో విడుదలైన విషయం తెలిసిందే. పంజాబ్ పీసీసీ చీఫ్‌గా సేవలందించారు. ఇటీవల రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఇక ఐపీఎల్‌లో సిద్దూ కామెంటేటర్‌గా రీఎంట్రీ ఇవ్వనుండడంతో ఆసక్తి నెలకొంది.

You may also like

Leave a Comment