Telugu News » Janhvi Kapoor: ‘నా మనసును తాకింది..’ నాని సినిమాపై జాన్వీ పొగడ్తలు..!

Janhvi Kapoor: ‘నా మనసును తాకింది..’ నాని సినిమాపై జాన్వీ పొగడ్తలు..!

హాయ్ నాన్న సినిమాపై అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ క్రేజీ బ్యూటీ జాన్వీ కపూర్ ‘హాయ్ నాన్న’ సినిమాను చూసి పొగడ్తలు కురిపిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది.

by Mano
Janhvi Kapoor: 'It touched my heart..' Janhvi compliments on the movie Nani..!

నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నటించిన హాయ్ నాన్న సినిమా (Hi Nanna Movie) మంచి విజయాన్ని అందుకుంది. కొత్త దర్శకుడు శౌర్యవ్.. స్క్రీన్‌పై ఎమోషనల్ డ్రామాను బాగా పండించాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 7న విడుదలైంది.

Janhvi Kapoor: 'It touched my heart..' Janhvi compliments on the movie Nani..!

ఇప్పుడు ఓటీటీ(OTT)లో విడుదలై అక్కడా మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు, హాయ్ నాన్న సినిమాపై అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ క్రేజీ బ్యూటీ జాన్వీ కపూర్ ‘హాయ్ నాన్న’ సినిమాను చూసి పొగడ్తలు కురిపిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది.

‘హాయ్ నాన్న సినిమా నా మనసును తాకింది. దర్శకుడు శౌర్యవ్ టేకింగ్ చాలా బాగుంది. మృణాల్ ఆకట్టుకుంది. మరొక్కసారి హీరో నాని తన నటనతో ఆకట్టుకున్నారు. అద్భుత నటనతో మెప్పించారు’ అంటూ జాన్వీ రాసుకొచ్చింది. జాన్వీకపూర్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది.

కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న సినిమా దేవర. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

 

You may also like

Leave a Comment