Telugu News » Jawan’s collections : తగ్గేదేలే అంటున్న ‘జవాన్’ కలెక్షన్ల జోరు..!

Jawan’s collections : తగ్గేదేలే అంటున్న ‘జవాన్’ కలెక్షన్ల జోరు..!

సౌత్ ఇండియన్ స్టార్ట్ డైరెక్టర్ అట్లీ(Atlee) - బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్(Shah Rukh Khan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘జవాన్(Jawan)’ సూపర్ హిట్ టాక్ తో నడుస్తోంది.

by sai krishna

సౌత్ ఇండియన్ స్టార్ట్ డైరెక్టర్ అట్లీ(Atlee) – బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్(Shah Rukh Khan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘జవాన్(Jawan)’ సూపర్ హిట్ టాక్ తో నడుస్తోంది.

రిలీజైన తొలిరోజు నుంచి కలెక్షన్ల ఊచకోత కొనసాగిస్తోంది. తొలి రోజు రూ. 75 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా..క్రమ క్రమంగా వసూళ్లను పెంచుకుంటూ సంచలనాలు సృష్టిస్తోంది.


ఇక ఐదో రోజు ఈ సినిమా ఇండియాలో రూ.30 కోట్ల నెట్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక ఓవర్సీస్ లో రూ.177 కోట్ల వసూళ్లతో..రూ.316 కోట్ల నెట్ అందుకుంది.మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఐదు రోజుల్లో రూ.520 కోట్లు రాబట్టినట్లు ట్రెడ్ వర్గాలు వెల్లడించాయి.

ఈ క్రమంలో 2023లో భారతదేశంలో రూ. 300 కోట్ల మార్కును దాటిన మూడవ బాలీవుడ్ చిత్రంగా ‘జవాన్’ చరిత్రకెక్కింది. ‘పఠాన్’ తొలి రోజు రూ.57 కోట్లు సంపాదించగా.. ‘జవాన్’ మాత్రం రూ. 75 కోట్లు వసూలు చేసి టాప్కు చేరుకుంది.ఈ క్రమంలో షారుక్ మరో రికార్డును అందుకున్నారు.

ఒకే ఏడాదిలో రిలీజైన రెండు సినిమాలకు రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించిన ఏకైక ఇండియన్ స్టార్గా చరిత్రకెక్కాడు.ఆయన నటించిన రెండు సినిమాలు ఇలా ఒకదానికి మించి ఒకటి రికార్డు స్థాయిలో వసూలు సాధించడం పట్ల షారుక్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నెట్టింట ‘జవాన్’ సినిమాను ట్రెండ్ చేస్తున్నారు. ముందు నుంచి భారీ అంచనాలు క్రియేట్ చేస్తూ వచ్చిన ‘జవాన్’కు థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో షారుక్ లుక్ కొత్తగా ఉందని, యాక్షన్ సీన్స్ అదిరిపోయాయంటూ సినిమా చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

ఇక ఈ సినిమాలో షారుక్కు జోడీగా తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించగా…సీనియర్ నటి ప్రియమణి ,సాన్యా మల్హోత్రా, యోగిబాబు, సునీల్‌ గ్రోవర్‌ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు.

మరోవైపు దీపికా పదుకొణె, స్టార్ హీరో సంజయ్‌ దత్‌ గెస్ట్ రోల్స్లో కనిపించారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించగా..రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మించారు.

You may also like

Leave a Comment