తమిళ్ హీరో ఇళయ దళపతి విజయ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ప్రస్తుతం రాజకీయాల్లోకి కూడా అడుగు పెడుతున్న విజయ్ తమిళ వెట్రి కళగం పేరుతొ పార్టీ స్థాపించి ప్రజాసేవ కోసం సిద్ధం అయినా సంగతి తెలిసిందే. విజయ్ కు చిన్నతనం నుంచే హీరో అవ్వాలనే కోరిక ఉండేది. అయితే తల్లి తండ్రులు మాత్రం తనను చదువుకోవాలి అని సూచించారు. టాప్ డైరెక్టర్ గా తండ్రి ఎదిగిన తీరు, రజిని కాంత్, విజయ్ కాంత్ వంటి హీరోల యాక్షన్స్ చూసి తాను కూడా టాప్ హీరో అవ్వాలని ఫిక్స్ అయిపోయాడు.
కానీ తల్లి తండ్రులు చదువు మీదే దృష్టి పెట్టమని చెప్పడంతో..అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఓ థియేటర్లో కూర్చుని ఒకే సినిమాను నాలుగు షో లు చూసాడు. ఆ తరువాత తండ్రి అతన్ని కనిపెట్టి ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికొచ్చాక కూడా తల్లితో తాను సినిమాల్లోకి వెళ్తానని చెప్పాడు. మంచి ఆస్తి, ఇల్లు, కారు.. ఏది కావాలంటే అది సంపాదిస్తానని చెప్పాడు. ఇక విజయ్ తండ్రి చంద్ర శేఖర్ కూడా కొడుకుని హీరోని చేయాలనీ అనుకున్నారు. అందుకోసం ఇల్లు తాకట్టు పెట్టారు కూడా. తన డైరెక్షన్ లో సిందూర పాండ్య సినిమా కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. విజయ్ కాంత్ ను ఈ సినిమాలో పెదరాయుడిగా నటించాలని కోరారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో పాటు విజయ్ కు మంచి డాన్సర్ గా పేరు వచ్చింది.
ఆ తరువాత చాలా సినిమాల్లో హీరోగా చేసాడు విజయ్. కానీ, జయ లలిత విజయ్ సినిమాలను ఆడనిచ్చేది కాదు. జయలలిత సీఎం గా ఉంటె విజయ్ సినిమాలకు థియేటర్ కూడా దొరికేది కాదు. జయలలిత పాలనలో అవినీతి ఎక్కువైందని.. డిఎమ్ కె కు ఓటు వెయ్యాలని ఓ సారి విజయ్ కోరాడు. దీనితో వారి మధ్య మరింత వివాదం పెరిగింది. దాదాపు ఐదు సంవత్సరాల పాటు పది సినిమాలు ఫ్లాప్ అయినా విజయ్ వెనక్కి తగ్గలేదు. ఆ తరువాత త్రి ఇడియట్స్ రీమేక్ తో సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. స్టార్ హీరోగా ఎదిగాడు. ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా అడుగులు వేయబోతున్నాడు.