Telugu News » Krithi Quite : బేబమ్మ బెంగపడకమ్మా…!

Krithi Quite : బేబమ్మ బెంగపడకమ్మా…!

ఇండస్ట్రీలో అడుగుపెట్టటం ఒక విషయమైతే..అవకాశాలను అందిపుచ్చుకోవటం, వాటిని నిలబెట్టుకోవడా ఇంకా పెద్దవిషయం. అలా జరక్కపోతే కథమళ్లీ మొదటికొస్తుంది.

by sai krishna

ఇండస్ట్రీలో అడుగుపెట్టటం ఒక విషయమైతే..అవకాశాలను అందిపుచ్చుకోవటం, వాటిని నిలబెట్టుకోవడా ఇంకా పెద్దవిషయం. అలా జరక్కపోతే కథమళ్లీ మొదటికొస్తుంది.

ప్రస్తుతం మన ‘ఉప్పెన’ బేబమ్మ అలాంటి ఒక సెపరేట్ ఫేజ్ లో ఉంది. ఆసినిమా హిట్ అవ్వడంతో 100 కోట్ల హీరోయిన్ అనిపించుకున్న ఈ బ్యూటీ, ‘శ్యామ్ సింగరాయ్(Shyam Singarai)’ , ‘బంగార్రాజు(Bangarraju)’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుంది.


దాంతో గోల్డెన్ లెగ్ అంటూ కృతిని ఆకాశానికి ఎత్తేశారు. అయితే ఈ సుందరి ఎంత ఫాస్టుగా టాప్ ప్లేస్ కి వెళ్లిందో అంతే ఫాస్టుగా డౌన్ అయిపోయింది.కృతి శెట్టి కొద్దో గొప్పో క్రేజ్ ఉన్న హీరోలతోనే జోడీ కట్టింది. కానీ దురదృష్టవశాత్తు ఆ సినిమాలు పరాజయం పాలయ్యాయి.

ఈ నేపథ్యంలోనే శ్రీలీల(Srilila)ఒక్కసారిగా పుంజుకుంది. దాంతో సహజంగానే కృతి శెట్టి వెనకబడింది. అయితే సమయాన్ని వృథా చేయకుండా తమిళ..మలయాళ (Malayalam) సినిమాలపై దృష్టిపెట్టింది.

గ్లామర్ పరంగా ,డాన్స్ పరంగా కృతికి వంకబెట్టవలసిన పనిలేదు. ఒక్క హిట్ పడితే ఆమె జోరు మళ్లీ కొనసాగే ఛాన్స్ ఉంది. ఆమె చేయవలసిందల్లా టాలీవుడ్ కి దూరం కాకుండా చూసుకోవడమే.

You may also like

Leave a Comment