ఫైనల్‌లో భారత్‌పై గెలిచి వరల్డ్‌కప్(World Cup)ను ఆస్ట్రేలియా(AUS) ఎగరేసుకుపోయింది. ఈ సందర్భంగా ఆసీస్ ఆటగాడు మిచెల్ మార్ష్(Mitchell Marsh) ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టిన ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా మార్ష్ తనను తాను సమర్థించుకున్నాడు.
కప్ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించలేదని మార్ష్ తెలిపాడు. మరోసారి కాళ్లు పెట్టడానికి విముఖత చూపనని తెలిపాడు. ‘ఆ ఫొటోలో ఎలాంటి అగౌరవం లేదు. దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు. సామాజిక మాధ్యమాల్ని అధికంగా చూడను. అందులో నాకెలాంటి తప్పు కనబడట్లేదు. నిజాయితీగా చెప్పాలంటే మళ్లీ అలా చేయడానికి వెనుకాడను’ అని మార్ష్ తెలిపాడు.
మరోవైపు, మార్ష్ ప్రపంచకప్‌పై కాళ్లు పెట్టడాన్ని టీమిండియా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ‘మేం ట్రోఫీ గెలిస్తే పూజలు చేసే వాళ్లం కదయ్యా..’ అంటూ నెట్టింట తెగ బాధపడిపోయారు. ఇంకొంత మంది మార్ష్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వివాదం అంతటితో ఆగలేదు.
ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ మీద ఆర్టీఐ యాక్టివిస్ట్ పండిట్ కేశవ్ ఫిర్యాదు మేరకు యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. వరల్డ్‌కప్ ట్రోఫీని అవమానించటంతో పాటుగా 140 కోట్ల మంది భారతీయుల సెంటిమెంట్‌ను గాయపరిచాడని కేశవ్ తన ఫిర్యాదులో ఆరోపించాడు. తాజాగా మార్ష్ ప్రకటనపై ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి మరి.