Telugu News » Mrunal Thakur: అరుదైన గౌరవాన్ని అందుకున్న సీతారామం బ్యూటీ..!

Mrunal Thakur: అరుదైన గౌరవాన్ని అందుకున్న సీతారామం బ్యూటీ..!

ప్రస్తుతం మృణాల్‌ ఠాకూర్‌ తెలుగులో విజయ్‌ దేవరకొండ, నాని చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.

by sai krishna

‘సీతారామం’ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన మరాఠీ బ్యూట్ మృణాల్ ఠాకూర్. ఈ సినిమాలో సీతగా చేసి టాలీవుడ్ ప్రేక్షక హృదయాలకు దగ్గరైంది. మళ్లీ అలాంటి పాత్రకోసం అశోకవనంలో సీతలా ఎదురు చూస్తోంది ఈ బాలీవుడ్ భామ. పలానా సినిమాలే చేస్తానంటే ఖాళీగా ఉండడానికి అవకాశాలొస్తాయి గానీ సీతారామం లాంటి సినిమాలొస్తాయా..అర్థం చేసుకోరు..అంటూ ఇండస్ట్రీ టాకు.!

అయితే మృణాల్ ఓ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. త్వరలో ఆస్ట్రేలియాలో జరుగనున్న ‘ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌’లో డైవర్సిటీ ఇన్‌ సినిమా అవార్డుకు ఎంపికైంది.

ఇదెలా అనుకుంటున్నారా…ఆమెగారు తెలుగులోనే కొత్త కానీ బాలీవుడ్ లో పాతేగా..సీరియల్ స్థాయినుంచి సినిమాల్లోకి చొరబడింది మరి..! మరాఠీ సినిమాతో మూవీ ఎంట్రీ ఇచ్చి కథానాయికగాన మృణాల్‌ ఠాకూర్‌..ఆ తర్వాత హిందీలో ‘లవ్‌ సోనియా’ ‘సూపర్‌ 30’వంటి సినిమాల్లో తనదైన అభినయంతో మెప్పించింది.


భిన్న భారతీయ భాషల్లో ప్రశంసాత్మక పాత్రల ద్వారా మృణాల్‌ ఠాకూర్‌ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుందని అవార్డుల కమిటీ పేర్కొంది.ఆమె కట్టుబాటును తెలుగు దర్శక నిర్మాతలు అర్థం చేసుకోక పోయినా ఇండియన్ అవార్డ్ కమిటీ అర్థం చేసుకుంది.

ఈ అవార్డుకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని స్ఫూర్తిదాయక పాత్రల్లో నటించడానికి ప్రేరణనిస్తుందని మృణాల్‌ ఠాకూర్‌ పేర్కొంది. ప్రస్తుతం మృణాల్‌ ఠాకూర్‌ తెలుగులో విజయ్‌ దేవరకొండ, నాని చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నదని సమాచారం.

You may also like

Leave a Comment