Telugu News » Abbas : కెరీర్ కు దెబ్బేసిన యాడ్ గురించి ఏం చెప్పాడంటే..!?

Abbas : కెరీర్ కు దెబ్బేసిన యాడ్ గురించి ఏం చెప్పాడంటే..!?

అబ్బాస్..ఒకప్పుడు యూత్ ఐకానిక్ హీరో..! ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా ‘ప్రేమదేశం’తోనే ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజియెస్ట్ యువ హీరో అయిపోయాడు.

by sai krishna

అబ్బాస్..ఒకప్పుడు యూత్ ఐకానిక్ హీరో..! ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా ‘ప్రేమదేశం’తోనే ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజియెస్ట్ యువ హీరో అయిపోయాడు. తర్వాత అతనికి చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఏ సినిమా అతనికి ‘ప్రేమదేశం’ తెచ్చిన గుర్తింపు తీసుకు రాలేదు. అప్పటి నుంచీ సినిమాల మీద ఫోకస్ తగ్గించేశాడు.

2015 తర్వాత ఒక్కసారిగా తెరమరుగైపోయాడు. సినిమాలు బంద్ చేసి బుద్ధిగా కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం అబ్బాస్ మళ్లీ సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే అబ్బాస్ కెరీర్ అర్ధాంతరంగా ఆగిపోవడానికి ఓ బలమైన కారణం ఉంది. ఒక రకంగా అబ్బాస్ మీదున్న అపవాదు కూడా అదే.ఓ ప్రముఖ టాయిలెట్ క్లీనిర్ యాడ్ చేయడం వల్లే కెరీర్ ఒక్కసారిగా ఢమాల్ అందని ఇండస్ట్రీలో చెవులు కొరుక్కున్నారు.

దీని మీద అబ్బాస్ స్పందించారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అబ్బాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘‘ నేను టాయిలెట్‌ క్లీనర్‌ను తాగమని అడగలేదు. బాత్రూం లో వాడండి అని చెప్పానంతే. టాయిలెట్‌ క్లీనర్‌ యాడ్‌లో నటించడం వల్ల నన్ను ఎంతోమంది ట్రోల్‌ చేశారు.

నన్ను వెక్కిరిస్తూ వీడియోలు కూడా క్రియేట్‌ చేశారు.అయితే వాటి వల్ల నేను ఏమాత్రం ఇబ్బంది పడలేదు. అలాగని వాళ్లు చేస్తున్న విమర్శలకు బాధపడలేదు. పరిశుభ్రత విషయంలో అవగాహన కల్పించడం కోసమే నేను ఆ ప్రకటనలో నటించా. మీ ఇంటిని క్లీన్‌గా ఉంచడం, ఉంచకపోవడమనేది మీ ఇష్టం.

ఆ యాడ్‌ చేస్తున్న సమయంలో నాకు అంత బిజీ పనులు ఏమీ లేవు. అందులో పని చేసినందుకు వాళ్లు నాకు మంచి పారితోషికం కూడా ఇచ్చారు. మా మధ్య దాదాపు ఎనిమిదేళ్లు కాంట్రాక్ట్‌ కుదిరింది.

అలా, వచ్చిన డబ్బుతో ఆ సమయంలో కుటుంబాన్ని పోషించా. కాబట్టి అందులో తప్పేముంది. నేను వృత్తులన్నింటినీ ఒకేలా చూస్తా. ప్రతి ఒక్కరూ తమ కుటుంబం కోసమే కష్టపడుతుంటారు. అందుకే నేను కూడా అలాంటి పని చేశాను’’ అంటూ చెప్పుకొచ్చాడు.

You may also like

Leave a Comment