సీతారామం(Seetharamam) సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా మారింది. తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించిన ఫ్యామిలీ స్టార్(Family Star) సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.
మృణాల్ టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ లోకూడా వరుస సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని నటించిన “జెర్సీ”(Jersey) సినిమాని హిందీలో రీమేక్ చేయగా అందులో షాహిద్ కపూర్ హీరోగా, మృణాల్ హీరోయిన్గా నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. తాను షాహిద్ కపూర్ కు పెద్ద అభిమానినని తెలిపింది.
ఆయనతో కలిసి నటించే అవకాశం రావడంతో ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఆ సినిమాకు ఓకే చెప్పానని, మొదటిరోజు షూటింగ్ సమయంలో ఎంతో భయం వేసిందని తెలిపింది. అయితే షాహిద్ నవ్వుతూ ఉండడంతో తనని చూస్తూ అలా ఉండిపోయానని ఆయన ఆన్ స్క్రీన్‌పై ఎలా నవ్వుతూ ఉంటారో ఆఫ్ స్క్రీన్ కూడా అలాగే నవ్వుతూ కనిపిస్తారని మృణాల్ తెలిపింది. అయితే ఇందులో ఓ సీన్లో హీరోని కొట్టాల్సి ఉంటుంది.
‘ఆ సీన్ చేయడానికి నేను చాలా భయపడ్డాను. నేను చిన్నగా కొడతాను మీరు ఎడిటింగ్‌లో చేసుకోండని చెప్పాను కానీ డైరెక్టర్ మాత్రం అసలు ఒప్పుకోలేదు. ఇక షాహిద్ కపూర్ కూడా ఆ సమయంలో ఎంతో సపోర్ట్ చేశారు. మీరు మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌ని గుర్తు చేసుకొని నన్ను కొట్టండి’ అంటూ తనకు సలహాలు ఇచ్చారని మృణాల్ తెలిపింది. అయితే ఆ సీన్ దాదాపు మూడు గంటల పాటు చేశామని చెప్పుకొచ్చింది.