Telugu News » Nagarjuna Sagar: అర్ధరాత్రి కేంద్ర బలగాల ఆధీనంలోకి నాగార్జున సాగర్..!

Nagarjuna Sagar: అర్ధరాత్రి కేంద్ర బలగాల ఆధీనంలోకి నాగార్జున సాగర్..!

సీఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణకు అప్పగించాలన్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రతిపాదనకు తెలంగాణ, ఏపీ అంగీకరించాయి. చర్చల అనంతరం నాగార్జున సాగర్‌ (Nagarjuna Sagar Dam)ను కేంద్ర బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి.

by Mano
Nagarjuna Sagar: Nagarjuna Sagar under the control of central forces at midnight..!

తెలంగాణ ఎన్నికలు(Telangana) హోరాహోరీగా జరుగుతుండగానే తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. సీఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణకు అప్పగించాలన్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రతిపాదనకు తెలంగాణ, ఏపీ అంగీకరించాయి. చర్చల అనంతరం నాగార్జున సాగర్‌ (Nagarjuna Sagar Dam)ను కేంద్ర బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి.

Nagarjuna Sagar: Nagarjuna Sagar under the control of central forces at midnight..!

మధ్యాహ్నం కల్లా పూర్తిగా సీఆర్పీఎఫ్(CRPFF) బలగాల ఆధీనంలోకి వెళ్లనుంది. అర్ధరాత్రి సాగర్ డామ్ వద్దకు సీఆర్పీఎఫ్ బలగాలు చేరుకున్నాయి. సాగర్ డ్యాం మొత్తాన్ని కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కేంద్ర బలగాలు రెండు రాష్ట్రాలను అధీనంలోకి తీసుకునేందుకు అంగీకారం తెలిపాయి. దీంతో అర్ధరాత్రికే సీఆర్పీఎఫ్ బలగాలను కేంద్రం పంపింది.

ఇండెంట్ లేకుండా, కనీసం లేఖ కూడా రాయకుండా ఏపీ నీటి విడుదల చేసిందని పేర్కొంటూ నివేదిక అందించడం జరిగింది. ముందు ఏపీ ఇచ్చిన ఇండెంట్ ప్రకారం జనవరి, ఏప్రిల్‌లో 5 టీఎంసీల చొప్పున నీటి విడుదల చేయాల్సి ఉందని కేఆర్ఎంబీ పేర్కొంది. సాగర్‌కు ఏపీ వైపు ఏపీ బలగాలు, తెలంగాణ వైపు ఆ రాష్ట్ర పోలీస్‌లు పహారా కాస్తున్నారు.

ఇప్పటికే కేఆర్ఎంబీ సభ్యులు సాగర్‌కు చేరుకున్నారు. తెల్లవారుజాము నుంచి ఒక్కో పాయింట్‌ను స్వాధీనం చేసుకుంటున్నారు. పరిస్థితిపై కేంద్రానికి నివేదిక అందించారు. ఏపీ ప్రభుత్వం నిబంధనలను అతిక్రమించి వ్యవహరించిందని కేఆర్ఎంబీ నివేదికను పంపించింది. 13వ గేటు వద్ద కంచెను తొలగించే అవకాశం ఉంది. కుడి కాలువ నుంచి ఏపీకి నీటి విడుదల కొనసాగుతోంది.

You may also like

Leave a Comment