Telugu News » నేరు మూవీ రివ్యూ.. సైలెంట్ గా ఓటిటిలోకి వచ్చి సూపర్ హిట్ కొట్టిన ఈ సినిమా ఎందుకు చూడాలంటే?

నేరు మూవీ రివ్యూ.. సైలెంట్ గా ఓటిటిలోకి వచ్చి సూపర్ హిట్ కొట్టిన ఈ సినిమా ఎందుకు చూడాలంటే?

నేరు మూవీ రివ్యూ.. !

by Sri Lakshmi
Neru-Movie-rating-in-telugu

ఇటీవల కాలంలో సినిమా ప్రేమికులు మలయాళం సినిమాలకు పెద్ద పీట వేస్తున్నారు. కారణం ఏంటంటే.. ఆ సినిమాలు ఆకట్టుకునే విధంగా ఉండడంతో పాటు.. రొటీన్ సన్నివేశాలకంటే కథనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉండడమే. చిన్న హీరో అయినా.. పెద్ద హీరో అయినా.. చిన్న బడ్జెట్ సినిమా అయినా.. పెద్ద బడ్జెట్ సినిమా అయినా.. అక్కడ కథ మాత్రమే హీరో. అందుకే అక్కడి సినిమాలు చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందిన సూపర్ హిట్ అవుతూ ఉంటాయి. తప్పకుండ ఆలోచించాల్సిన అంశాలపైనే వారి సినిమాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి సినిమాల్లో “నేరు” ఒకటి. దృశ్యం సినిమాతో తెలుగు నాట మంచి పేరు తెచ్చుకున్న జీతూ జోసెఫ్ ఈ సినిమాకు డైరెక్టర్.

స్టోరీ:
ఈ సినిమా ఓ అంధురాలి చుట్టూ తిరుగుతుంది. ఓ అంధత్వం కలిగిన అమ్మాయిని ఓ గుర్తు తెలియని వ్యక్తి బలాత్కారం చేస్తాడు. అయితే.. ఆమె స్వతహాగా శిల్పి కావడంతో అతని రూపాన్ని ఊహించి ఓ శిల్పాన్ని చిక్కుతుంది. ఆ శిల్పాన్ని పోలిన వ్యక్తిని పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేస్తారు. అతను ఓ పాపులర్ బిసినెస్ మాన్ కొడుకు కావడంతో ఈ కేసు పై మీడియా ఫోకస్ చేస్తుంది. ఆ పాపులర్ వ్యక్తి తరపున ఓ టాప్ లాయర్ కేసు వాదిస్తాడు. అతనికి బెయిల్ కూడా ఇప్పిస్తాడు. బెయిల్ పై బయటకు వచ్చిన ఆ వ్యక్తి ఈ అమ్మాయిని బెదిరిస్తాడు. కేసు వాపస్ తీసుకోవాలని చెబుతాడు. కానీ ఆమె అందుకు ఒప్పుకోదు. ఈ పరిస్థితిలో మరో టాప్ లాయర్ గా పేరు తెచ్చుకున్న మోహన్ లాల్ ఈ కేసుని టేకప్ చేస్తాడు. ఆ తరువాత ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ అమ్మాయికి న్యాయం జరిగిందా లేదా అన్నది సినిమా చూస్తే తెలుస్తుంది.

రివ్యూ: ఈ సినిమాలో నటీనటులందరూ తమ తమ పాత్రలలో అద్భుతంగా నటించారు. ఇక మోహన్ లాల్ పాత్ర గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఈ సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలుస్తారు. సినిమా చివరివరకు ఎక్కడా బోర్ కొట్టకుండా.. తరువాత ఏమి జరుగుతుందో అని ఉత్సుకతగా అనిపించేలా తీయడం లో జోసెఫ్ సక్సెస్ అయ్యాడు.

ప్లస్ పాయింట్స్:
మోహన్ లాల్
ఇంటరెస్టింగ్ కోర్ట్ సీన్స్

మైనస్ పాయింట్స్
కొన్ని లాగ్ అనిపించే సన్నివేశాలు

రేటింగ్: 3/5

You may also like

Leave a Comment