సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా గుంటూరు కారం. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా ఇప్పుడు విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితం అవుతోంది. అయితే.. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ చాలా మంది ఈ సినిమాను చూసి రొటీన్ కాన్సెప్ట్ సినిమాలా ఫీల్ అయ్యారు. రొటీన్ హీరోయిజం, ఫైట్స్, పాటలు.. వీటితో బోర్ కొట్టేసిన చాలా మంది ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఓ అభిమాని మరో అడుగు ముందుకేసి తన ఆవేదనని వ్యక్తం చేసాడు. తాను ఎంతగానో అభిమానించే హీరో మహేష్ బాబు అని.. ఆయన నుంచి ఇటువంటి సినిమా నచ్చలేదు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. గతంలో నాని, ఖలేజా, వన్ నేనొక్కడినే లాంటి ప్రయోగాత్మక సినిమాలు చేసి అలరించారని.. కానీ ఈ మధ్య రొటీన్ కథలకే ఫిక్స్ అయిపోతున్నారు అంటూ బాధపడ్డారు. టివిలో సర్కారు వారి పాట, భరత్ అనే నేను, శ్రీమంతుడు లాంటి సినిమాలు వస్తే.. ఏ సినిమా ఏదో కూడా గుర్తు లేకుండా కన్ఫ్యూజ్ అవుతున్నానని అన్నారు.
ఎక్కడైనా నాలుగు సినిమాలు ఒకేలా ఉంటాయా అన్నా? అంటూ మహేష్ ను ప్రశ్నించారు. కొత్త కథలను ఎంచుకోమని.. ఇతర హీరోల లాగా కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వాలని అభిమాని శ్రీనివాస్ కోరారు. అవుట్ డేటెడ్ పాత దర్శకులతో.. రొటీన్ కథనాలతో సినిమాలు వద్దు అంటూ మహేష్ ను రిక్వెస్ట్ చేసారు. సదరు అభిమాని రాసిన లేఖను మీరు ఇక్కడ చదివేయచ్చు.