Telugu News » Prashanth Varma Upcoming Movies List: హనుమాన్ కాకుండా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మరో 11 సినిమాలు.. అవేంటంటే?

Prashanth Varma Upcoming Movies List: హనుమాన్ కాకుండా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మరో 11 సినిమాలు.. అవేంటంటే?

by Sri Lakshmi
prashanth-varma-cinema-list

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు ఇప్పుడు ఎక్కడ చూసినా మారు మ్రోగి పోతోంది. హనుమాన్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమాను అద్భుతంగ డైరెక్ట్ చేసిన ప్రశాంత్ వర్మకు కూడా మంచి పేరు వచ్చింది. హనుమాన్ సినిమాలో తేజ సజ్జ, అమృత అయ్యర్ హీరో, హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా ఓ సూపర్ హీరో సినిమాగా రూపొందింది. అయితే… ప్రశాంత్ వర్మ ఇలాంటి సినిమాలు మొత్తం పన్నెండు అని చెప్పారు. తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మొదటి సినిమాగా హనుమాన్ వచ్చిందని, ఇంకా పదకొండు సినిమాలు వస్తాయని తెలిపారు. ఆ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూసేద్దాం.

వీటిని చదవండి: అప్పట్లో మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా నటించి.. ఇప్పుడు తల్లిగా కనిపించిన హీరోయిన్.. ఎవరంటే?

prashanth-varma-cinema-list

prashanth-varma-cinema-list

 

సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన హనుమాన్ సినిమా రికార్డుల పరంగా దుమ్ము దులిపేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదల అయిన మిగతా సినిమాల కలెక్షన్ ఒకెత్తు, హనుమాన్ సినిమా కలెక్షన్ మరొక ఎత్తు అన్నట్లుగా ఈ సినిమా కలెక్షన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో ఓ సామాన్యుడికి హనుమంతుడు పవర్స్ వస్తే ఎలా ఉంటుంది? అన్నా పాయింట్ చుట్టూ కథ నడుస్తుంది. కథ, కధనం అన్ని ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది.

వీటిని చదవండి: సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఓపెన్ లెటర్ రాసిన ఓ అభిమాని.. ఇక వాళ్ళు వద్దు అన్నా అంటూ.?

ఈ సినిమా తరువాత ప్రశాంత్ వర్మ పాపులర్ నిర్మాత డివివి దానయ్య కుమారుడితో “అధీర” అనే టైటిల్ తో మరో సినిమా చేస్తున్నారట. ఈ సినిమాలో ఇంద్రుడి పవర్స్ గురించి చూపించబోతున్నారట. ఈ సినిమా కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం గానే రాబోతోంది. ఈ సినిమాలనే మరో పది సినిమాలు కూడా వస్తాయట. సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ గా రూపొందుతున్న ఈ సినిమాలో హిందూ గాడ్స్ పవర్స్ గురించి చూపించనున్నారట.

You may also like

Leave a Comment