మెగా పవర్ స్టార్(Mega Power Star) రామ్ చరణ్ తేజ్(Ram Charan Tej) ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్‌తో గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా చేస్తున్నాడు. అయితే, చరణ్ వరుస సినిమాలతో పాటు పలు వ్యాపార రంగాల్లో రాణిస్తున్నాడు. తాజాగా, క్రీడా రంగంలోకి అడుగుపెడుతున్నాడు చరణ్.
అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్‌లు మాత్రమే సినీ ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు క్రికెట్ టీమ్‌ను కొన్నవారిలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ జాబితాలో రాంచరణ్ వచ్చి చేరాడు. చరణ్ ఓ క్రికెట్ టీమ్‌కు ఓనర్ అయ్యాడు. ISPL-T10 (ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ – T10)లో హైదరాబాద్ క్రికెట్ జట్టుని చరణ్ కొన్నాడు. స్టీట్ టు స్టేడియమ్ అనే స్లోగన్‌తో ఈ ప్లేయర్స్ రిజిస్ట్రేషన్‌ని ఓపెన్ చేసారు.
ఐపీఎల్ టీ20 అయితే ఐఎస్పీఎల్ 10 ఓవర్లు మాత్రమే ఉంటుంది. 2024 మార్చ్ 2 నుంచి మొదలవనున్న ఈ ప్రీమియర్‌లో చరణ్ టీమ్ ఆడనుంది. మరోవైపు, రాం చరణ్ సినిమాల విషయానికి వస్తే.. శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా 2024 సెప్టెంబర్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచే బజ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.
ఈ మూవీ పూర్తవగానే చరణ్, బుచ్చిబాబుతో RC16 రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేయనున్నాడు. ఇంకా చరణ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతకు ముందే బుచ్చిబాబు రామ్ చరణ్ ఫ్రీ అవ్వగానే ఆర్సీ 16 షూటింగ్‌ను స్టార్ట్ చేసేలా ప్రీప్రొడక్షన్ వర్క్స్‌ను పూర్తి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.