రేణు దేశాయ్(Renu Desai) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పవన్ కల్యాణ్(Pawan kalyan)తో విడాకుల తర్వాత ఆమె రెండో పెళ్లి(Secound marriage)పై చాలా వార్తలు పుట్టుకొచ్చాయి. సుమారు ఆరు నెలల కిందట రేణు.. రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. దీంతో ఆమెను పవన్ ఫ్యాన్స్(pawan kalyan fans) ఏకిపారేశారు. దీంతో ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుందని వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో రేణుదేశాయ్ తాజాగా తన రెండవ పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ‘పవన్ నుంచి విడిపోయిన కొంతకాలం తర్వాత కుటుంబ సభ్యుల సలహాతో సెకండ్ మ్యారేజ్‌కి ఒకే చెప్పా. అందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. నిశ్చితార్థం కూడా జరిగింది. ఆ సమయంలో ఆద్యకు ఏడేళ్లే. పెళ్లి చేసుకుంటే ఆమెకు టైమ్ ఇవ్వలేనని పెళ్లి రద్దు చేసుకున్నా. ఇప్పుడు ఆద్యకు13 ఏళ్లు. మరో మూడు ఏళ్ల తర్వాత నా గురించి ఆలోచిస్తా’ అని క్లారిటీ ఇచ్చింది.
రేణుదేశాయ్ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇందులో రేణుదేశాయ్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఆ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. అందులో రేణు సింపుల్ హోమ్లీ లుక్‌లో కనిపించింది. ఆమె ఇటీవల సినిమా ప్రమోషన్లలో భాగంగా సినిమా విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలనూ పంచుకుంటోంది.
రేణుదేశాయ్, పవన్‌లకు ఇద్దరు పిల్లలు అకీరా, ఆధ్య. అకీరా త్వరలోనే సినిమాల్లోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రేణు తన పిల్లలపై ప్రేమను అప్పుడప్పుడు ఇలా పలు ఇంటర్వ్యూల ద్వారా తెలియజేస్తూనే ఉంది. పవన్‌కల్యాణ్ కూడా రాజకీయాల్లో బిజీగా ఉంటూనే పిల్లలకు టచ్‌లోనే ఉంటున్నట్లు సమాచారం.