Telugu News » ప్యాన్ వరల్డ్ ..వైపు ‘సలార్’ పరుగులు…రిలీజ్ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే..!?

ప్యాన్ వరల్డ్ ..వైపు ‘సలార్’ పరుగులు…రిలీజ్ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే..!?

ప్రభాస్ కాబోతున్నాడు వరల్డ్ వైడ్ డార్లింగ్..

by sai krishna

చాలా సిగ్గుపడే భీమవరం కుర్రాడతను..పెదనాన్న ప్రోత్సాహంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. వచ్చిన కొత్తల్లో తన ఏజ్ గ్రూప్ హీరోల నటన, క్రేజ్ చూసి తనకు ఆ రేంజ్ గుర్పింపు వస్తుందా..!? ఆ ఫ్యాలోయింగ్ వచ్చే చాన్స్ తనుకుందా..?! ఇంతకీ నేను నటుణ్నేనా..?! అనే ఫీలింగ్ తో ఉండేవాడట.

అయితే రోజులు గడుస్తున్నాయ్…ఏవో సినిమాలు పడుతున్నాయ్.పెద్దగా గుర్తింపు రాలేదు. కొన్నాళ్లకు అతపై ‘వర్షం’ పడింది ప్రభాస్ అయ్యాడు. ప్రభాస్ కాస్తా మూవీ లవ్వర్స్ కి డార్లింగ్ అయ్యాడు. ఆ తర్వాత సినిమాల్లో మిస్టర్ పెర్ఫెక్ట్ అయ్యాడు.

ఇంకొన్నాళ్లకు బాహుబలి అయ్యాడు…ప్యాన్ ఇండియన్ హీరో అయ్యాడు. ఇప్పుడు ప్యాన్ వరల్డ్ స్టార్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం డార్లింగ్ అభిమానులు..సిల్వర్ స్క్రీన్ పై సలార్ ఎంట్రీకోసం చూస్తున్నారు.ఇప్పడు ఈ మూవీ స‌లార్‌ సినిమాను భార‌తీయ భాష‌ల‌తో పాటు ఇంగ్లీష్‌లోనూ రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

ప్రపంచ సినీ అభిమానులను దృష్టిలో పెట్టుకొని సలార్ ఇంగ్లీష్ వెర్ష‌న్‌ను మేకర్స్.. హాలీవుడ్ సినిమాల‌కు ధీటుగా సిద్ధం చేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. సౌండ్ మేకింగ్‌, డ‌బ్బింగ్ విష‌యంలో కూడా స్పెష‌ల్ కేర్ తీసుకుంటున్నాోరట.

అంతేకాకుండా ఇంగ్లీష్ వెర్ష‌న్‌ కోసం కొత్త రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్‌చేసే ఆలోచ‌న‌లో సినిమా యూనిట్ ఉన్న‌ట్లు స‌మాచారం.భారతీయ భాషల్లో విడుదల అయిన రెండు వారాల త‌ర్వాత ఇంగ్లీష్ వెర్ష‌న్ విడుద‌ల‌కాబోతున్న‌ట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

పాన్ ఇండియా లెవెల్‌లో సలార్ మూవీ సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ కాబోతుండ‌గా.. ఇంగ్లీష్ భాష‌లో మాత్రం అక్టోబ‌ర్ 13న ఈ మూవీ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంగ్లీష్ వెర్ష‌న్ రిలీజ్ డేట్‌ను కూడా ప్ర‌త్యేకంగా సినిమా యూనిట్ రివీల్ చేసే అవ‌కాశం ఉంద‌ని సమాచారం.

కన్నడ స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్ -2 బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత డైరెక్టర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీపై టాలీవుడ్‌, బాలీవుడ్‌తోపాటు అన్ని భాష‌ల్లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి.

గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. దాంతోపాటు ఈ మూవీలో మ‌ద‌ర్ సెంటిమెంట్‌తో పాటు ఫ్రెండ్‌షిప్ అంశాల‌ను ప్ర‌శాంత్ నీల్ ట‌చ్ చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది.

మరోవైపు, ఈ సినిమా ట్రైలర్ ఆగ‌స్ట్ నెల‌లోనే రిలీజ్ చేయ‌బోతున్నారు. స‌లార్ చిత్రంలో మ‌ల‌యాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. జ‌గ‌ప‌తిబాబు, శృతిహాస‌న్‌, టీనూ ఆనంద్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

స‌లార్ మూవీ రెండు పార్ట్‌లుగా రూపొందుతోన్నట్లు స‌మాచారం. ఈ సినిమాను హోంబ‌లే ఫిల్మ్స్ ప‌తాకంపై విజ‌య్ కిర‌గందూర్ నిర్మిస్తున్నారు.

You may also like

Leave a Comment