Telugu News » Shilpa serious: ట్రోలర్స్ తాట తీసిన శిల్ప..అసలేమైందంటే..!?

Shilpa serious: ట్రోలర్స్ తాట తీసిన శిల్ప..అసలేమైందంటే..!?

తనపై వస్తున్న ట్రోల్స్ కు రివర్స్ పంచ్ ఇచ్చింది బాలీవుడ్ సీనియర్ నటి శిల్పశెట్టి(Shilpa Shetty).

by sai krishna

తనపై వస్తున్న ట్రోల్స్ కు రివర్స్ పంచ్ ఇచ్చింది బాలీవుడ్ సీనియర్ నటి శిల్పశెట్టి(Shilpa Shetty). స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తన ఇంటి ఆవరణలో శిల్ప జెండావందనం(flag hosting)చేసి తన దేశభక్తిని చాటుకుంది. సదరు వీడియోను కూడా షేర్ చేసింది.

అయితే ఈ వీడియోలో, శిల్ప చెప్పులేసుకుని జాతీయ జెండా ఎగరేస్తుండడంతో ట్రోలింగ్స్ రెపరెపలాడాయి. తగ్గేదేలేదన్నట్టుగా ట్రోలర్స్ పై ఎదురు దాడికి దిగింది ఈ ముదురు పొడుగుకాళ్ల సుందరి.

త్రివర్ణ పతాకాన్ని(Tricolor flag) ఎగరేసే సమయంలో పాటించాల్సిన నిబంధనల(Flag code) గురించి తనకు పూర్తి అవగాహన ఉందని శిల్ప స్పష్టం చేసింది. చెప్పులేసుకోకూడదన్న నియమం ఫ్లాగ్ కోడ్‌లో ఎక్కడా లేదని ఆమె స్పష్టం చేసింది.

తన వాదనకు బలం చేకూర్చేలా గూగుల్‌లో ఓ ఆర్టికల్‌ను వెతికి మరీ నెట్టింట షేర్ చేసింది. ట్రోలర్లు తమ అవగాహనా రాహిత్యాన్ని ప్రదర్శించడం, ప్రతికూల వాతావరణాన్ని సృష్టించడాన్ని తాను అస్సలు సహించనని మొహం వాచేలా చివాట్లు పెట్టింది.

ఎదుటి వారిని అనేముందు వాస్తవాలు తెలుసుకోవాలంటూ వారిని మందలించింది
ఇక శిల్ప త్వరలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఓ వెబ్‌సిరీస్‌లో నటించనుంది. ఇండియన్ పోలీస్ ఫోర్స్(Indian Police Force)పేరిట నిర్మితమవుతున్న ఈ వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో త్వరలో విడుదల అవుతుంది.

You may also like

Leave a Comment