Telugu News » Snake sensation : కష్టపడి ఒక పామును తరిమేశారు..తర్వాత వచ్చాయి 30..!?

Snake sensation : కష్టపడి ఒక పామును తరిమేశారు..తర్వాత వచ్చాయి 30..!?

అసోం జిల్లాలోని జోర్ హట్ జిల్లాలో పాముల తుట్ట కలకలం రేపింది.హతిజురి(Hatizuri)టీ ఎస్టేట్ లో నివాసం ఉంటున్న శంకర్ బనియా అనే వ్యక్తి ఇంట్లో దాదాపు 30 పాములు కాపురం పెట్టాయి.

by sai krishna

అసోం జిల్లాలోని జోర్ హట్ జిల్లాలో పాముల తుట్ట కలకలం రేపింది.హతిజురి(Hatizuri)టీ ఎస్టేట్ లో నివాసం ఉంటున్న శంకర్ బనియా అనే వ్యక్తి ఇంట్లో దాదాపు 30 పాములు కాపురం పెట్టాయి.

స్నేక్ టీమ్ వాటిని సేకరించి సురక్షిత ప్రదేశాలకు చేరుస్తామని తెలిపింది. వివరాల్లోకి వెళితే..కొద్దిరోజుల క్రితం శంకర్ బనియా నివాసం ఉండే ఇంటికి సమీపంలో ఓ భారీ పాము సంచరిస్తూ ఉండేది.

దాన్ని తరిమి కొట్టటంతో పాముల బెడద వదిలింది అనుకుని ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఆ పాము ఇంటి చుట్టూ తిరుగుతూ కనిపించేది.

దీంతో సమస్య మొదటికొచ్చింది అనుకున్న శంకర్ బనియా దాన్ని తరిమేందుకు ప్రయత్నించగా అది ఓ గదిలోని ఫ్లోర్ కిందకు దూరింది.ఆ తర్వాత నుంచి గంటకోపాము ఆ గదిలోంచి బయటకు రావడం మొదలు పెట్టాయి.ఖంగుతిన్న శంకర్ బనియా స్నేక్ టీమ్(Snake Team)కి సమాచారం అందించాడు.

స్థానికంగా పాములు పట్టే నిపుణుడిగా పేరుగాంచిన అనిల్ తాసా(Anil Tasa)అనే వ్యక్తి.. గదిలోని ఫ్లోర్ను తవ్వి ‘చక్రి ఫేటీ’ (కోబ్రా డి కాపెల్లో)గా పిలువబడే 30 నాగు పాము పిల్లలను రక్షించాడు. వాటిని అటవీ శాఖకు అప్పగిస్తానని తెలిపాడు.

You may also like

Leave a Comment