Telugu News » Taapsee Pannu: ‘అది నా పర్సనల్..’ హీరోయిన్ తాప్సీ పన్నుఆగ్రహం..!

Taapsee Pannu: ‘అది నా పర్సనల్..’ హీరోయిన్ తాప్సీ పన్నుఆగ్రహం..!

ఇలాంటి వార్తలను ఎందుకు ప్రచారం చేస్తారో అర్థం కాదు. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యవహారాలపై సోషల్‌మీడియా వేదికగా స్పందించడం నాకు ఇష్టం ఉండదని తాప్సీ తెలిపింది.

by Mano
Taapsee Pannu: 'That's my personal..' Heroine Taapsee Pannu's anger..!

హీరోయిన్‌ తాప్సీ పన్ను(Taapsee Pannu) పెళ్లికి సంబంధించి నెట్టింట వార్తలు జోరుగా వైరల్ అవుతున్నాయి. ఆమె మార్చి చివరి వారంలో రాజస్థాన్(Rajasthan)​లోని ఉదయ్‌పూర్‌లో సీక్రెట్​గా పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆ వార్తల్లో ఉంది. అయితే తాజాగా దీనిపై నటి తాప్సీ స్పందించింది. తనపై ప్రచారం చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చింది.

Taapsee Pannu: 'That's my personal..' Heroine Taapsee Pannu's anger..!

‘ఇలాంటి వార్తలను ఎందుకు ప్రచారం చేస్తారో అర్థం కాదు. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యవహారాలపై సోషల్‌మీడియా వేదికగా స్పందించడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ఈ విషయంపై ఏం మాట్లాడదలచుకోలేదు. భవిష్యత్తులోనూ ఇలాంటి వార్తలపై స్పందించను’ అంటూ సమాధానమిచ్చింది.

దీంతో ఈ హీరోయిన్ పెళ్లి వార్తలకు చెక్‌ పడినట్లైంది. డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మథియాస్‌ బోతో తాప్సీ గత కొన్నేళ్లుగా ప్రేమాయణాన్ని సాగిస్తున్నది. వీరిద్దరూ కలిసి పలు ప్రైవేట్‌ కార్యక్రమాలకు హాజరైన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. పదేళ్ల నుంచి అతనితో ప్రేమలో ఉన్నట్లు తాప్సీ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

అయితే పెళ్లి విషయంపై మాత్రం స్పందించడానికి అనేక సందర్భాల్లో నిరాకరించింది. ప్రస్తుతం తాప్సీ హిందీలో ‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’ చిత్రంలో నటిస్తోంది. ఇది వరకు తెలుగు, తమిళ సినిమాల్లో నటించినా అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో ఆమె బాలీవుడ్​ బాట పట్టింది. అక్కడ ‘పింక్’ చిత్రంతో పెద్ద హిట్ అందుకుంది.

అప్పటి నుంచి ‘ముల్క్’ , ‘బడ్లా’, ‘తప్పడ్’ వంటి చిత్రాలతో వరుసగా సక్సెస్​లను ఖాతాలో వేసుకుంది.  ముఖ్యంగా లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేసి మంచి పేరు సంపాదించుకుంది. రీసెంట్​గా గతేడాది డిసెంబర్​లో షారుక్ ఖాన్​తో కలిసి​ ‘డంకీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఆశించినంత స్థాయిలో ఆడలేదు కానీ మంచి వసూళ్లను రాబట్టింది.

You may also like

Leave a Comment