ప్రశాంత్ వర్మ దిరెచ్తిఒన్ లో తేజ సజ్జా హీరోగా వచ్చిన సినిమా హనుమాన్ రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫలితం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అయితే.. ఈ రిజల్ట్ కోసం ఇటు డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మ, అటు హీరో గా తేజ సజ్జ చాలానే కష్టపడ్డారట. ఇటీవల ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ సందర్భంగా తేజ సజ్జా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ సినిమాలో హనుమంతుని శక్తులు పొందిన హనుమంతు అనే పాత్రలో తేజ సజ్జా నటించారు. సినిమాలో భాగంగా.. హనుమంతు కు హనుమంతుడి శక్తులు వస్తాయి. ఆ సమయంలో ఎక్కువ గాల్లోనే ఉన్నట్లు కనిపిస్తూ ఉండాలి. ఇందుకోసం తేజ సజ్జా కనీసం ఆరేడు గంటల పాటు తాళ్లు పట్టుకుని వేలాడుతూనే ఉండాల్సి వచ్చేదట. అది కష్టమైనా ఎంతో ఓర్చుకుని చేసాడు తేజ. ఇదే కాకుండా.. ఎక్కువ భాగం షూటింగ్ దుమ్ము, ధూళిలోనే జరిగింది. ఆ దుమ్ము ధూళి వలన కూడా తేజ సజ్జా కంటి చూపుకి ఇబ్బంది అయ్యింది. హాస్పిటల్ కి వెళ్తే సర్జరీ చేయాలనీ అన్నారట. కానీ, షూటింగ్ కు ఇబ్బంది అవుతుంది అన్న కారణంతో తేజ సజ్జా అప్పుడే వద్దని, షూటింగ్ అయ్యాక చేయించుకుంటానని చెప్పారట. ఆ బాధని ఓర్చుకునే షూటింగ్ ను కంప్లీట్ చేశారట.