చిన్న పెద్ద ఏముంది..సినిమాలో విషయం ఉంటే ఏదైనా చూస్తారు. అలాంటి సినిమాలు పరభాషలో ఉన్నా ఓటీటీ(OTT )ల్లో వెతుక్కుని మరీ చూస్తారు.వాటికి గోడమీద పోష్టర్లు అంటించక్కర్లేదు, టీవీల్లో ప్రచారాలు గుప్పించక్కర్లేదు. యాక్టర్స్ తో కూడా పనిలేదు..జస్ట్ కంటెంట్.సినిమా తన సినిమా చూపిస్తే చాలు. దాని పబ్లిసిటీ బాధ్యతలన్నీ ప్రేక్షకుడే చూసుకుంటాడు.
సినిమాలో దమ్ముండి,ఆకట్టుకునే సంగీతం ఉండి కాస్త నవ్వులు పూయించే సీన్లుండి, ఇంకాస్త ఆలోచింపజేసే కంటెంట్ ఉన్న సినిమాలను సినీ ప్రేక్షకుడు నెత్తినపెట్టుకున్నాడు. ఈ మధ్యకాలంలో ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అతి తక్కువ బడ్జెట్ తో బ్లాక్ బస్టర్ అయిని కొన్ని తెలుగు సినిమాలు గురించి తెలుసుకుందాం.
బలగం (Balagam ):
ఒక్కోసారి జీవితమే సినిమా అనిపిస్తుంది..ఇంకోసారి సినిమా చూస్తుంటే జీవితం అనిపిస్తుంది…సరిగ్గా అలాంటి భావోద్వేగ బలమున్న సినిమాయే బలగం. హీరో ప్రియదర్శి, డైరెక్ట్ చేసిన వేణు తప్ప..నటించి యాక్టర్లు కూడా పెద్దగా ఎవరికీ తెలియరు.
పక్కా తెలంగాణా పల్లెపదాల పాటలు,మాటలతో, తెలంగాణా మట్టివాసనతో, అచ్చమైన మనుషుల అంతర్ముఖంతో జనం ముందుకు వచ్చి కలెక్షన్ల జల్లెడ పట్టింది. చిన్నప్పుడు ఆడిన ఆటలు, యాసలు,వేషాలు, మరువని మాటలు, అన్నింటికీ మించి ఎన్ని బాధలు ఉన్నా కుటుంబ మమకారం, మరోవైపు ప్రతిక్షణం మనల్ని సవాలు చేస్తూ, స్వార్థపరులుగా మార్చే ఈతి భాధలు, అన్నింటినీ జయించి తిరిగి ఒక స్వచ్ఛమైన సగటు పల్లెటూరి మనిషిగా మారిన మనుషుల ఇతి వృత్తంగా, హృద్యంగా భావోద్వేగాల రథంగా, రుచించి, వసించి, స్ఫృశించిన సినిమా బలగం.
ఇంటి పెద్దమనిషి ఆత్మ శాంతి కోసం పెట్టే పిట్ట కూడు కాకి ముట్టకుండా చేసి,తన చెప్పాలనుకున్న ఉద్దేశాన్ని ప్రేక్షకుడికి గోరుముద్దగా అందించాడు. ఫైట్లు,భారీ యాక్షన్ సెట్టింగులు లాంటివేవీ లేకుండా ఒక్క పాటతో థియేటర్ని కట్టిపడేశాడు దర్శకుడు వేణు.
పెట్టుబడి పెట్టింది దిల్ రాజే అయినా తెలంగాణా ప్రజ తన సొంత చేసుకుంది.సంస్కృతి అక్కున చేర్చుకుంది. పిల్లా జెల్లా బస్సులెక్కి మరీ థియేటర్ తరలివచ్చింది. వీధి వీధి తెరలు కట్టుకుని చూసింది. సినిమా చూసి పంతాలు పట్టింపులతో దూరమైన ఎన్నోకుటుంబాలు దగ్గరయ్యాయి.
విడిపోయిన ఎంతో మంది అన్న చెల్లెళ్లు మళ్లీ కలుసుకున్నారు. మరిచిన బంధాన్ని ఓ సగటు ప్రేక్షకుడికి విడమరిచి చెప్పింది ‘బలగం’. ఇంత కన్నా ఓ సినిమాకి ఏం కావాలి, సినిమా అంతిమ లక్ష్యాన్ని నిజజీవితంలో అన్వయించుకున్న ప్రేక్షకుడి ప్రాక్టికాలిటీ కన్నా అవార్డు ఓ సినిమాకి ఏం కావాలి.
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ , బెస్ట్ సినిమా టోగ్రఫీ ఎట్ లోకల్(Best Cinematography at Local), లాస్ ఏంజెల్స్ సినిమా టో గ్రఫీ(Los Angeles movie toe graphy) అవార్డుల్లాంటి మూడు అవార్డులను తన ఖాతాల్లో వేసుకున్న అత్యున్నత సినిమాగా బలగం తెలుగు సినీచరిత్రలోను,భారతీయ చలన చిత్ర చరిత్రలోనే సమున్నత స్థానాన్ని దక్కించుకుంది.
సామజ వరగమన(samajavaragaman ) :
ఎలాంటి ముందస్తు హడావుడి లేకుండా వచ్చి తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించిన సినిమా ‘సామజవరగమన’. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం సూపర్ సక్సెస్ అయ్యింది.
కథ పరంగా కొత్తగా కలిసిన సంబంధం ప్రకారం చూస్తే హీరోకి హీరోయిన్ చెల్లవుతుంది ఈ చిత్రంలో చిత్రమైన కాన్ ఫ్లిక్ట్, హీరో మధ్యతరగతి వాడుగా మిగిలిపోవడానికి అతని తండ్రి 20 యేళ్లుగా డిగ్రీపాస్ కాకపోవడం అనే విచిత్రమైన కామిక్ పాయింటు.
ఈ రెండుపాయింట్లతో సినిమా క్షణం తీరక లేకుండా నవ్విస్తుంది. సీనియర్ హీరో నరేశ్ అయితే తన కామెడీ టైమింగ్ తో ఆడుకున్నాడు. కథలోని అంశం కాస్త కొత్తదే అయినా కథనం,సంభాషణలు అద్భుతంగా పండాయి.పాటలు కథకు బియ్యంలో రాళ్లలా అడ్డుతగిలినా కథనంతో వాటిని గుర్తురానీ కుండా చేశాడు దర్శకుడు.
మిడిల్ క్లాస్ కుర్రాళ్లా శ్రీవిష్ణు సనిమాని రక్తికట్టించాడు.కుటుంబ సమేతంగా చూడతగ్గ సినిమాగా ‘సామజవరగమన’ సినిమా ఓ వరం. తక్కువ బడ్జెట్ సాదా సీదాగా వచ్చి అటు తెలుగు ప్రేక్షకులకు ఒక రీఫ్రెష్ మెంట్, ఇటు ప్రొడ్యూసర్ కి హిట్టింగ్ ప్రాఫిట్ ఇచ్చిన సినిమా.
విమానం (Vimanam ) :
విమానం..హృదయాన్ని తాకే ఓ తండ్రి కొడుకుల జీవన ప్రయాణం. బస్తీలో ఉండే తండ్రీకొడుకులు, అవిటి తండ్రి ఎవ్వరి దగ్గరా చేచాకుండా కష్టపడి కొడుకును చదివించుకుంటూ ఉంటాడు. పూటగడవని పరిస్థితులున్న పేదకుటుంబంలోని కుర్రాడికి విమానం ఎక్కాలనే ఆశ.
అయితే ఆ కుర్రాడు చివరికి విమానం ఎక్కాడా లేదా అన్నదే సినిమా. బస్తీ చుట్టు అల్లుకున్న జీవితాలు వారి ఆశనిరాశలతో ఎమోషనల్ ట్రావెల్ చేయిస్తాయి.తెలుగు తమిళ్ భాషల్లో రిలీజ్ అయ్యింది.
కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్(Kiran Korrapati Creative Works) బ్యానర్ పై కిరణ్ కొర్రపాటి నిర్మించిన చిత్రం.శివప్రపాద్ యానాల దర్శకత్వం తెరకెక్కించాడు.ఏ ప్రచారం లేకుండా విమానం సినిమా ప్రేక్షకుల్లోకి దూసుకువెళ్లింది. అందించాల్సిన భావోద్వేగాన్ని అందించి అద్భుతం అనిపించింది.
బేబి(Baby ) :
తెలుగు సినిమా పల్లెటూరి ప్రేమకథల్ని మరిచిపోయి చాలా రోజులవుతుంది. హృదయకాలేయం, కొబ్బరిమట్టలాంటి సెటైరిక్ కామెడీ సీన్లను సినిమాగా తీసిన దర్శకుడు సాయిరాజేష్(Sairajesh) ఈ సారి గల్లీ ప్రేమకథతో కోట్లు కొల్లగొట్టాడు.
హీరో తమ్ముడనే ఒక ఇమేజ్ తప్ప కమర్షియల్ స్టార్ డమ్ లేని ఆనంద్ దేవర కొండ హీరోగా, వెబ్ సిరీస్ లో సుపరిచయం అయిన వైష్ణవి తేజ అనే తెలుగమ్మాయి హీరోయిన్ గా చేసి విరాజ్ అశ్విన్ అనే కొత్తకుర్రాణ్ని కాంపిటేటివ్ లవ్వర్ గా మలిచిన అద్భుతమైన చిత్రం.
ప్రస్తుత సమాజంలోని అమ్మాయిలు ప్రేమ పేరుతో తమని తాము ఎలా ఆత్మవంచన చేసుకుంటున్నారో చెప్పే కథ. ప్రాణంగా ప్రేమించడం తప్ప ఎటువంటి ఎక్ స్ట్రా క్వాలిఫికేషన్ లేని ఓ ఆటో డ్రైవర్ గా హీరో,సగటు మధ్యతరగతి విలేజ్ అమ్మాయి వైష్ణవి తేజ, పల్లెటూరి అమ్మాయికి న్యూలైఫ్ స్టైల్ చూపించే విరాజ్ అశ్విన్ ల మధ్య జరిగే ట్రైయాంగిల్ లవ్ స్టోరీ.
ఇది జరిగే ప్రతి సన్నివేశం మనలో ప్రతిఒక్కరి జీవితంలో జరిగిందే.ఇందులో హీరోలు విలన్లు ఎవరూ లేరు. మధ్యలో ట్రూలవ్ కి అట్రాక్టివ్ లవ్ కి మధ్య జరిగే సంఘర్షణను డైరెక్టర్ అద్భుతంగా ఎలివేట్ చేశాడు.
కథ, కథనం,పాటులు,మాటలు అద్భుతంగా వర్కవుట్ అయ్యాయి. ఓ రెండుప్రేమ మేఘాలిలా అనే థీమ్ సాంగ్ ట్రెండ్ అయ్యింది. డైరెక్టర్ లైఫ్ లో ఎదరైన కొన్న వాస్తవ సంగతులకు ఫిక్షన్ యాడ్ చేసి తీసిన బేబీ మూవీ గల్లీ, గ్రామీ,కాలేజ్,యూనివర్శిటీ,కుర్రోళ్లను రంపం పెట్టికోసి..పిండి జూస్ తీసింది.
ప్రేమించిన ఇద్దరి అబ్బయిల్నీ మోసం చేసి పరిస్థితులకు తలవంచి ఎవరో ముక్కూమొహం తెలియని అబ్బాయిని పెళ్లి చేసుకున్న విలేజ్ బేబి పాత్రలో వైష్ణవి తేజ అద్భుతంగా నటించింది.
చేసింది నెగిటివ్ రోల్ అయినా ఈ అమ్మాయికి మంచిపేరు వచ్చింది.కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అయ్యింది. ప్రచారంలో ఉన్న సమారం ప్రకారం 4 కోట్లతో సినిమా తీస్తే 70 డెబ్భైకోట్లు వసూల్ చేసిందని..ఓటీటీలో కూడా బాగానే అమ్ముడు పోయిందని టాకు.
ఇవన్నీ కాపీ కథలు కావు తెలుగు నేలమీద పుట్టి, నడిచి, నడిపిస్తున్న కథలు, మలయాళంలో సక్సెస్ అయిన కథలకు మన పైత్యం యాడ్ చేసి అవసరమైన మేరకు చెడగొట్టే పేరుగొప్ప సినిమాలకన్నా మన గల్లీల్లో పుట్టి ఇళ్లళ్లో పెరిగి మనల్ని ఆలోచింపజేసే ఇలాంటి సినిమాల కోసం తెలుగు ప్రేక్షకుడు ఎప్పుడూ టిక్కెట్ కొనుక్కుని రెడీగా ఉంటాడు.