Telugu News » ఒక్కో ద‌ర్శ‌కుడికి ఒక్కో న‌టుడు… పక్కా వీళ్ళు ఉండాల్సిందే..!

ఒక్కో ద‌ర్శ‌కుడికి ఒక్కో న‌టుడు… పక్కా వీళ్ళు ఉండాల్సిందే..!

ఈ స్టార్ దర్శకుల సినిమాల్లో ఈ నటులు ఉండాల్సిందే? వీరికి ఒక సెంటిమెంట్ !

by Sravya

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు వర్క్ అవుట్ అవుతుంటాయి. చాలామంది దర్శకులు సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు. ఒకసారి ఏదైనా సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే మళ్లీ మళ్లీ దానిని ఫాలో అవుతూ ఉంటారు. దర్శకులతో పాటుగా హీరోలు హీరోయిన్లు కూడా సెంటిమెంట్లు ని ఫాలో అవుతుంటారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు. టాలీవుడ్ లో కొంతమంది దర్శకల సినిమాల్లో పక్కాగా కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులని పెడుతుంటారు. అలా సెంటిమెంట్తో క్యారెక్టర్ ఆర్టిస్టులు ని పెట్టే డైరెక్టర్లు, ఆ క్యారెక్టర్ ఆర్టిస్టులు వివరాలు ఇప్పుడు చూద్దాం.

రాజమౌళి:

రాజమౌళి శాంతినివాసం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు తర్వాత సినిమాలకి దర్శకత్వం వహించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఫెయిల్యూర్ లేని డైరెక్టర్ గా కొనసాగుతున్నారు రాజమౌళి. రాజమౌళి సినిమాలో చంద్రశేఖర్ మనకి కచ్చితంగా కనబడుతూ ఉంటాడు.

హరీష్ శంకర్:

హరీష్ శంకర్ సినిమాల్లో రావు రమేష్ పక్కగా ఉంటారు. గబ్బర్ సింగ్, మిరపకాయ నుండి డిజె సినిమా దాకా హరిష్ శంకర్ సినిమాల్లో మనకి రావు రమేష్ కనపడతాడు.

పూరి జగన్నాథ్:

పూరి జగన్నాథ్ కూడా ఒక సెంటిమెంట్ ఉంది పూరి జగన్నాథ్ సినిమాల్లో సుబ్బరాజుని పెడతారు. అమ్మ నాన్న తమిళ అమ్మాయి నుండి పూరి సినిమాలో పక్కాగా సుబ్బరాజ్ కనపడతాడు. పూరి దర్శకత్వం వహించిన 70% సినిమాల్లో సుబ్బరాజు ఉన్నాడు.

కృష్ణవంశీ:

కృష్ణవంశీ సినిమాల్లో చూస్తే బ్రహ్మాజీ కనపడుతూ ఉంటాడు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాల్లో బ్రహ్మాజీ ఉన్నాడు.

Also read:

శ్రీకాంత్ అడ్డాల:

శ్రీకాంత్ అడ్డాల సినిమాలో రావు రమేష్ ని పెడుతూ ఉంటాడు కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇలా చాలా సినిమాల్లో రావు రమేష్ ని పెట్టారు.

త్రివిక్రమ్:

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అమిత్ ఎక్కువగా కనబడుతుంటాడు.

You may also like

Leave a Comment