అమెరికా (America)లో కాల్పులు ఆగడం లేదు.. గతంలో ఎన్నో సార్లు గర్జించిన గన్.. పొట్టన పెట్టుకొన్న ప్రాణాలు ఎన్నో.. తాజాగా ఇక్కడ మరోసారి కాల్పులు చోటు చేసుకొన్నాయి. నిందితుడు తన కుటుంబంలోని ముగ్గురు సభ్యులను కాల్చి చంపాడు. పెన్సిల్వేనియా (Pennsylvania)లోని, ఫిలడెల్ఫియా (Filadelphiyaa)లో ఈ ఘటన జరిగింది..
కాగా కాల్పుల అనంతరం నిందితుడు దొంగిలించిన కారులో న్యూ జెర్సీ (New Jersey)కి పారిపోయాడని తెలుస్తోంది. మరోవైపు విషయం తెలుసుకొన్న పోలీసులు నిందితుని కోసం రంగంలోకి దిగారు.. వెంటనే గాలింపు చర్యలు చేపట్టి హంతకున్ని అదుపులోకి తీసుకొన్నారు. అయితే ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి 26ఏళ్ల ఆండ్రీ గోర్డాన్ జూనియర్‌గా గుర్తించినట్లు వెల్లడించారు.
మృతి చెందిన వారు.. గోర్డాన్ సవతి తల్లి కరెన్ గోర్డాన్, సోదరి కేరా గోర్డాన్, మరో వ్యక్తిని టేలర్ డేనియల్‌గా తెలిపారు. నిందితుడు పెన్సిల్వేనియాలోని రెండు వేర్వేరు ప్రదేశాలలో తన కుటుంబ సభ్యులను హత్య చేశాడని తెలిపిన పోలీసులు.. గోర్డాన్ ఆధునిక రైఫిల్‌తో కాల్పులకు పాల్పడినట్టు వెల్లడించారు. దాడి సమయంలో నిందితుడు తమ ఇంటి దగ్గరి నుంచే వెళ్లే వారిని కూడా లక్ష్యంగా చేసుకొన్నట్టు తెలిపారు. అయితే ఘటనకు గల కారణాలను వెల్లడించలేదు.
ఇక అమెరికా వ్యాప్తంగా ఏదో ఒక చోట తరచూ గన్ ఫైర్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.. అదేవిధంగా అగ్రరాజ్యంలో సామాన్యుల భద్రత గాల్లో దీపంలా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.. మరోవైపు గత ఆరు రోజుల క్రితం అర్కాన్సాస్ రాష్ట్రంలోని జోన్స్బోరోలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందిన ఘటన మరవక ముందే.. మరో ముగ్గురు తుపాకి గుండుకు బలి అవడం విషాదకరం..