రాష్ట్రంలో ఐపీఎల్ (IPL) సందర్భంగా క్రికెట్ బెట్టింగ్ (Cricket Betting) దందా జోరుగా సాగుతుంది.. ఈ ఆట మీద ఉన్న పిచ్చి ఒకవైపు కాగా.. పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందనే ఆశతో కొందరు బెట్టింగ్ పై ఆసక్తి చూపిస్తున్నారు.. ఈ నేపథ్యంలో రోజు కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని సమాచారం.. కాగా ఈ ఉచ్చులో పడి కొందరు ఆర్థికంగా దివాళా తీస్తున్న ఘటనలు సైతం చోటు చేసుకొంటున్నాయి..
ఈ క్రమంలో సమాచారం అందుకొన్న సైబరాబాద్ (Cyberabad) ఎస్వోటీ పోలీసులు తాజాగా మియాపూర్, కూకట్పల్లి పరిధిలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 15 మంది క్రికెట్ బెట్టింగ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. కాగా వీరంతా వివిధ రకాల ఆన్లైన్ (Online) యాప్స్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్నట్లు గుర్తించారు. అదేవిధంగా నిందితుల నుంచి 2 కోట్ల 41 లక్షల నగదు, ల్యాప్టాప్స్, సెల్ ఫోన్లు వంటి వాటిని స్వాధీన పరచుకొన్నారు..
మరోవైపు హైదరాబాద్ (Hyderabad) శివారు ప్రాంతాలను అడ్డాగా చేసుకొని బెట్టింగ్లకు పాల్పడుతున్న ఈ ముఠా.. ప్రతిరోజు కోట్ల రూపాయాల బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు (Police) దర్యాప్తులో గుర్తించారు.. ఇలాంటి చర్యల వల్ల మంచి కుటుంబాలు సైతం రోడ్డున పడుతాయని తెలిపిన వారు.. ఎవరైనా బెట్టింగ్ పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.