Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తెలంగాణ(Telangana)లో ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి. గత ప్రభుత్వ ఫల్యాలను ఎత్తిచూపుతూ బీజేపీతో పాటు అధికార కాంగ్రెస్ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఎంపీ అర్వింద్ రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేశారు. సీఎం వైఖరిని కేసీఆర్ గత పాలనతో పోలుస్తూ అసహనం వ్యక్తం చేశారు. నిధులన్నీ నల్గొండ, ఖమ్మం నిధులకే మళ్లిస్తూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాజీ సీఎం కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారని ఎంపీ అర్వింద్(MP Arvind) విమర్శించారు.
సీఎం వైఖరిని నిరసిస్తూ ఎంపీ ఎన్నికల తర్వాత కొడంగల్‌లో దీక్ష చేస్తానన్నారు. పసుపు పంటపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గతంలో కంటే లక్షన్నర ఎకరాల సాగు పెరిగిందన్నారు. గత పాలకుల విధానాల వల్లే పసుపు రైతులకు కష్టాలు వచ్చాయన్నారు.
షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించడం బీజేపీతోనే సాధ్యమన్నారు. అబద్దపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిట్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు అభ్యర్థులు కరువయ్యారన్నారు.