Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
ఏపీ (AP)లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేడేక్కాయి. వైసీపీ (YCP)కి పోటీగా టీడీపీ (TDP), జనసేన (Janasena) పొత్తు పెట్టుకొన్న విషయం తెలిసిందే.. జగన్ (Jagan) ఓటమి లక్ష్యంగా ఈ రెండు పార్టీలు ముందుకు సాగుతున్నాయి.. ఈ క్రమంలో జనసేన పార్టీలో చేరికలు ఊపందుకొన్నాయి. పవన్ కల్యాణ్ నాయకత్వానికి వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు సీనియర్ నేతలు జై కొడుతున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ ను కలిసిన సీనియర్ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, వైసీపీ ఎంపీ బాలశౌరి జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు.

పవన్ కు రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళిక ఉందని, రాజీలేని పోరాటం చేసే వ్యక్తి ఆయన అని చెప్పారు. రాష్ట్రంలో అరాచకపాలన అంతమొందించాల్సి బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఇక కాపు సామాజిక వర్గానికి చెందిన ఉత్తరాంధ్ర నేత కొణతాల రామకృష్ణ వారి వర్గంలో మంచి పేరుంది. మరోవైపు YS కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి.. జనసేనపార్టీలో చేరనున్నారు. త్వరలోనే మంచిరోజు చూసుకుని జనసేనలో చేరతానని అనౌన్స్ చేశారు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్‌ను కలిసి చర్చించానని తెలిపారు. కుటుంబసమేతంగా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు బాలశౌరి. కొణతాలను, జనసేన పార్టీ అధినేత పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అయితే రానున్న రోజుల్లో జనసేనలో మరిన్ని చేరికలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ చేరికలతో పార్టీకి బలం పేరుతుంది. కానీ గెలుపుని ఎంత వరకు అందిస్తాయో అనే ఆసక్తి పలువురిలో కలుగుతుంది..


