Telugu News » UK : బ్రిటన్ లో మన డాక్టర్ల హవా .. ఓవర్సీస్ లో ‘ఓవర్ స్పీడ్’ !

UK : బ్రిటన్ లో మన డాక్టర్ల హవా .. ఓవర్సీస్ లో ‘ఓవర్ స్పీడ్’ !

by umakanth rao
uk-most-new-docs-and-nursses-in-uk-came-from-india

విదేశాల్లో.. ముఖ్యంగా బ్రిటన్ లో ఇండియాకు చెందిన డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది సంఖ్య తక్కువేమీ కాదు. ఇతర దేశాలతో పోలిస్తే మనోళ్ల హవా చాలా ఎక్కువగా ఉందని ఓ అధ్యయనంలో తేలింది. డాక్టర్ల సంఖ్య 20 శాతం, నర్సుల సంఖ్య 46 శాతం ఉన్నట్టు వెల్లడైంది. 2022 లో యూరోపియన్ యూనియన్ కు చెందని దేశాల నుంచి ఈ దేశానికి స్కిల్డ్ వర్క్ వీసాలు పొంది అత్యధిక సంఖ్యలో హెల్త్ కేర్ వర్కర్స్ చేరారని, వీరిలో ఎక్కువమంది ఇండియా నుంచి వచ్చినవారేనని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ లోని మైగ్రేషన్ అబ్జర్వేటరీ విభాగం ఓ నివేదికలో తెలిపింది.

ఈయూ దేశాలనుంచి వచ్చిన వారు కేవలం ఒక శాతం మాత్రమేనని స్పష్టం చేసింది. ఇండియా తరువాత నైజీరియా, పాకిస్తాన్, ఫిలిపీన్స్ దేశాలున్నాయి. గత ఏడాది సర్టిఫికెట్స్ ఆఫ్ స్పాన్సర్ షిప్ ను వినియోగించుకున్న వారిలో కూడా భారతీయులే అధిక సంఖ్యలో ఉన్నారని ఈ రిపోర్టు పేర్కొంది.

ఈ ఏడాది మార్చితో అంతమైన కాలానికి 57, 700 మంది కేర్ వర్కర్లు స్కిల్డ్ వర్క్ వీసాలను పొందారని, గతంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ సిస్టం అంగీకరించింది. 2022 సంవత్సరానికిగాను … అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఈ దేశంలోకి ఓవరాల్ ఇమ్మిగ్రేషన్ .. 24 శాతం ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది.

అయితే నాణేనికి రెండో వైపులా తాత్కాలిక వీసాలపై వచ్చిన కేర్ వర్కర్ల శ్రమ శక్తిని దోచుకునే అవకాశాలున్నాయని మైగ్రేషన్ అబ్జర్వేటరీ డైరెక్టర్ డా. మెడిలిన్ సంప్టన్ ఆందోళన వ్యక్తం చేశారు. వీరి వేతన చెల్లింపులు నిరాశాజనకంగా ఉండవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. తమ వేతనాల విషయంలో వీరు పెను సవాళ్ళను ఎదుర్కోవచ్చునన్నారు.

You may also like

Leave a Comment