మెగాస్టార్ ఇప్పటివరకు 150 కి పైనే సినిమాలు చేశారు. వీటిల్లో చాలా సినిమాలు బ్లాక్ బూస్టర్లుగానే నిలిచాయి. అయితే.. ఇన్ని సినిమాల్లో మెగాస్టార్ కి ఆ బిరుదుని తీసుకొచ్చిన సినిమా మాత్రం గ్యాంగ్ లీడర్ సినిమా. ఈ సినిమా చిరు కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. విజయశాంతి, మెగాస్టార్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదరడంతో ఈ సినిమా పాటలు కూడా నెక్స్ట్ లెవెల్ హిట్ అయ్యాయి. అప్పట్లో ఈ సినిమా పాటలను చూడడం కోసమే మళ్ళీ మళ్ళీ థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకులు కూడా ఉన్నారు.
కానీ, అంతటి విజయం సాధించిన ఈ సినిమాను చేయడానికి ముందు చిరంజీవి ఒప్పుకోలేదు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది విజయ్ బాపినీడు. ఆయన పట్నం వచ్చిన పతివ్రతలు, మగధీరుడు, హీరో వంటి సినిమాలతో మెగాస్టార్ కి హిట్స్ ఇచ్చారు. సరికొత్త కథతో మళ్ళి మెగాస్టార్ కి హిట్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో “గ్యాంగ్ లీడర్” స్టోరీ రాసుకున్నారు. ఈ స్టోరీని వినిపించగానే మెగాస్టార్ ఈ సినిమా నేను చెయ్యను, ఇది ఆడదు అని చెప్పేశారట. కానీ, విజయ్ బాపినీడు మాత్రం వదల్లేదు. ఆ కథని పరుచూరి బ్రదర్స్ కి వినిపించారు.
వారు ఆ కథలోని లోపాలను గుర్తించి వాటిని సరి చేస్తామని, మూడు రోజుల టైం కావాలని అడిగారట. అదే విషయాన్నీ చిరుకి చెప్పగా ఆయన పరుచూరి బ్రదర్స్ ని నమ్మి ఒకే చేశారట. ఆ తరువాత కథని తీసుకొచ్చి వినిపించగా మెగాస్టార్ సరే అన్నారు. అల్లు అరవింద్ ని పిలిచి డేట్స్ మాట్లాడమని అన్నారట. అల్లు అరవింద్ కూడా ఆ కథని చెప్పమని చెప్పి.. దానిని రికార్డు చేసుకుని మరీ ఇంటికి వెళ్లారట. మళ్ళీ ఆ కథని సరిగ్గా విని అప్పటికి కానీ ఒకే చేయలేదట.