Telugu News » “హనుమాన్” సినిమాలో బాలయ్యకి అవమానం జరిగేంతలా ఏమి ఉంది? ఆ సన్నివేశం ఏంటంటే?

“హనుమాన్” సినిమాలో బాలయ్యకి అవమానం జరిగేంతలా ఏమి ఉంది? ఆ సన్నివేశం ఏంటంటే?

హనుమాన్ సినిమాలో బాలయ్య బాబుకు ఏమి అవమానం జరిగింది?

by Sri Lakshmi

ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జా హీరోగా నటించిన సినిమా హనుమాన్. ఈ సినిమాలో తేజ సజ్జాకి హనుమంతుని శక్తులు వస్తాయి. అయితే.. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే.. బాలయ్య బాబు అభిమానులు మాత్రం ఈ మూవీ టీం పై గుర్రుగా ఉన్నారు. స్పూఫ్ సన్నివేశాలు తీయాలని అనుకుని.. బాలయ్య బాబుకి అవమానం చేసారు అంటూ మండిపడుతున్నారు. ఇంతకీ బాలయ్య బాబు అభిమానులు ఎందుకు ఫైర్ అవుతున్నారో తెలుసుకుందాం.

ఈ సినిమాలో తేజ సజ్జాకు హనుమంతుని శక్తులు వస్తాయి. తేజ సజ్జాకు ఓ నదిలో హనుమంతుని రక్తము చుక్కతో ఏర్పడ్డ మణి ఒకటి దొరుకుతుంది. సూర్య రశ్మి ఉన్న టైం లో ఆ మణి వలన తేజకు హనుమంతుని శక్తులు వస్తాయి. మొదట్లో ఈ విషయం తేజకు కూడా తెలియదు. ఆ పవర్స్ ను అల్లరిగా ఉపయోగిస్తాడు. అందరు హీరోల హిట్ సన్నివేశాలను స్పూఫ్ గా తీయడానికి ట్రై చేస్తాడు. అలానే.. బాలయ్య బాబు ట్రైన్ సీన్ ను స్పూఫ్ చేయాలనీ అనుకుంటాడు.

తన ఫ్రెండ్స్ సాయంతో ఈ స్పూఫ్స్ చేస్తూ ఉంటాడు. `పల్నాటి బ్రహ్మనాయుడు` సినిమాలో నుంచి ట్రైన్ సన్నివేశాన్ని స్పూప్ చేయాలనీ అనుకుంటాడు. అందుకే రెండు ట్రైన్స్ ఎదురెదురుగా వచ్చే సన్నివేశాన్ని స్పూఫ్ చేస్తున్న సమయంలో జై చెన్నకేశవ అంటూ తొడ గొడతాడు. కానీ, ఆ టైం లో పవర్స్ పని చేయవు. ట్రైన్ వెనక్కి వెళ్లకపోగా ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. దీనిపై బాలయ్య ఫాన్స్ ఆగ్రహిస్తున్నారు. స్పూఫ్ పేరిట సన్నివేశాన్ని హాస్యాస్పదం చేస్తున్నారని, బాలయ్య బాబుని అవమానిస్తున్నారని మండిపడుతున్నారు.

You may also like

Leave a Comment