ఒకప్పుడు తాగుడుని ఒక వ్యసనంగా చూసేవాళ్లు. ఇప్పుడు చాలా మార్పులొచ్చాయి. మన దేశమే కాదు, ఎన్నోదేశాల ఎకానమీ తాగుబోతునే నమ్ముకుంది. తాగి వాళ్లు తూలుతున్నా ఆర్థిక వ్యవస్థ మాత్రం స్టడీగా నిల్చుంటోంది.
మందుబాబుల గురించి ఎవరికీ తెలియంది కాదు. కోర్టర్ వేశాడంటే లాయర్ కన్నా ఎక్కువ వాదిస్తారు. సుప్రీంకోర్టు జడ్జికి కూడా శిక్ష వేసేస్తారు. ఏబీసీడీలు రాని వాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు. కూర్చుంటే లేవలేని వాడు కుంగ్ ఫూ చేసేస్తాడు. కళ్ల ముందు ఇన్ని కఠోర సత్యాలు కనిపిస్తున్నా తాగడం వల్ల ఒరిగే ఉపయోగాల కన్నా.. అనర్థాలే ఎక్కువనుకోండి అది వేరే విషయం.
మనలో మనమాట ఎక్కువ మందుబాబుల ఉన్న దేశం గురించి తెలుసుకుందామని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అసలు ఇలాంటి లిస్ట్ ఒకటుంటుందని మీకు తెలుసా? తెలియకపోతే ఓ లుక్కేయండి.
266 దేశాల్లో ఉన్న మందుబాబుల డేటా తీసుకుంటే.. ఎక్కువ మంది తాగుబోతులున్న దేశం కుక్ ఐలాండ్స్. రెండో స్థానంలో లట్వియా, మూడో స్థానంలో చెక్ రిపబ్లిక్ ఉందట. నాలుగో స్థానంలో లితువేనియా, ఐదో స్థానంలో ఆస్ట్రియా ఉన్నాయి. ఇంతకీ ఇండియా ఏస్థానంలో ఉందో తెలుసా.. 111 వస్థానంలో. చూద్దాం ఈ ర్యాంక్ ఇక్కడతో ఆగుతుందో గోడలు పట్టుకు ఎగబాకుతుందో!