Saindhav Telugu Movie Review: సైంధవ్ మూవీ రివ్యూ:: వెంకటేష్ హీరోగా శ్రద్ధ శ్రీనాధ్ హీరోయిన్ గా శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న సినిమా సైంధవ్. ఈ రోజు గ్రాండ్ గా సైంధవ్ రిలీజ్ అయ్యింది. ఇప్పటికే ప్రీమియర్ షోస్ నడుస్తూ ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాపై తమ అభిప్రాయాలను ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా హిట్టా? ఫట్టా? వెంకటేష్ కెరీర్ లో మరో హిట్ ఆడ్ అవుతుందా లేదా? ఈ సినిమా రివ్యూ ఏంటో చూసేద్దాం.
కాస్ట్ & క్రూ:
నటీనటులు
వెంకటేశ్
శ్రద్దా శ్రీనాథ్
రుహానీ శర్మ – డా. రేణు
ఆండ్రియా జెర్మియా
ఆర్య – మానస్
నవాజుద్దీన్ సిద్దిఖీ – వికాస్ మాలిక్
జయప్రకాశ్
బేబీ సారా – గాయత్రి
క్రూ:
దర్శకత్వం: శైలేష్ కొలను
రచన: శైలేష్ కొలను
నిర్మాత: వెంకట్ బోయినపల్లి
సంగీతం సంతోష్ నారాయణన్
నిర్మాణ సంస్థ: నిహారిక ఎంటర్టైన్మెంట్
స్టోరీ:
సైంధవ్ కోనేరు గా నటించిన వెంకటేష్ కు సైకో అనే పేరు ఉంటుంది. తన గతాన్ని వదిలేసి తన ఫ్యామిలీ కోసం కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు సైంధవ్. అయితే.. తన కూతురుకి అనారోగ్యం వస్తుంది. ఆమెకు జబ్బు నయం కావాలంటే ఓ ఇంజక్షన్ చెయ్యాల్సి ఉంటుంది. దాని ఖరీదు పదిహేడు లక్షల రూపాయలు ఉంటుంది. మరి ఈ మొత్తం డబ్బుని సాధించడానికి సైంధవ్ ఏమి చేసాడు? అతనికి ఉన్న చేదు గతం ఏమిటి? మళ్ళీ గతం లోకే సైంధవ్ వెళ్తాడా? కూతుర్ని ఎలా బ్రతికించుకుంటాడు? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే.
రివ్యూ:
కూతురు బాగుండడం కోసం ఓ తండ్రి పడే తపనని కళ్ళకి కట్టినట్లు చూపించాడు వెంకటేష్. ఈ రోల్ కు ఆయన వంద శాతం న్యాయం చేసాడనే చెప్పచ్చు. అయితే.. కొన్ని చోట్ల సన్నివేశాలు అంత పవర్ ఫుల్ గా అనిపించవు. ఈ పేలవ సన్నివేశాల వలన కూడా సినిమాపై ఆసక్తి తగ్గుతుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమా పంచ్ గట్టిగా లేదనే చెప్పవచ్చు. యాక్షన్ సన్నివేశాలు బాగున్నా.. నేరేషన్ ఫ్లాట్ గా అనిపిస్తుంది. మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా కొంత నిరాశపరచవచ్చు.
ప్లస్ పాయింట్స్:
వెంకటేష్ నటన
మైనస్ పాయింట్స్:
పేలవ సన్నివేశాలు
ఫ్లాట్ నేరేషన్
రేటింగ్:
2 /5